Sandeep Reddy Vanga: స్పిరిట్ సినిమాను కూడా యానిమల్ సినిమాలనే ప్లాన్ చేస్తున్నాడుగా

Sandeep Reddy Vanga: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేశాడు. అప్పట్లో శివ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ఈ మధ్యకాలంలో అర్జున్ రెడ్డి సినిమా కూడా అంతటి ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా తర్వాత ఇదే సినిమాని బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించాడు. కబీర్ సింగ్ సినిమాని చాలామంది బాలీవుడ్ ప్రముఖులు టార్గెట్ చేయడమే కాకుండా సినీ క్రిటిక్స్ కూడా కేవలం 2 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. అయినా కానీ బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం దాదాపు 200 కోట్లకు పైగా వసూలు ఇచ్చారు.

ఇకపోతే అక్కడితో సందీప్ రెడ్డి వంగ పేరు ఒక బ్రాండ్ గా మారింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో డైరెక్ట్ గా కాకుండా బాలీవుడ్ లోనే అనిమల్ సినిమాను అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇకపోతే రీసెంట్ గా బాక్సాఫీస్ వద్ద అనిమల్ సినిమా దాదాపు 1,000 కోట్లకు పైగా వసూలు చేసింది. సందీప్ రెడ్డి వంగ స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ అయింది. ఈ సినిమాని కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు అని వీటన్నిటికీ కూడా ఈ సినిమా కలెక్షన్స్ సమాధానం చెప్పాయి.

Sandeep Vanga

- Advertisement -

ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ చేయబోయే తదుపరిచిత్రం స్పిరిట్. ప్రభాస్ హీరోగా నటించబోతున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. అయితే అనిమల్ సినిమా మాదిరిగానే ఈ సినిమాకు సంబంధించి ఒక వాయిస్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అనిమల్ సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు కూడా ఇలానే చేశాడు సందీప్. మళ్ళీ అదే మాదిరిగానే స్పిరిట్ కూడా చేసి అనిమల్ లాంటి సక్సెస్ కొట్టబోతున్నాడు చాలామంది అంచనా వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు