Sanjay Dutt : విలన్ రూట్

కొన్ని రోజుల క్రితం స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్నవారు ప్రస్తుతం విలన్ పాత్రలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ లో జగపతి బాబు ఇప్పుడు ప్రతి నాయకుడి పాత్రలకు రోల్ మోడల్ గా నిలుస్తున్నాడు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. సంజయ్ దత్ బాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకడు. సంజయ్ దత్ సినిమాలు వస్తున్నాయంటే, హిందీ బెల్ట్ రాష్టాల్లో చాలా మంది ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూసే వారు.

సంజయ్ దత్ 2012లో అగ్నిపథ్ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. దీని తర్వాత ఇటీవల కేజీఎఫ్ 2 లో పవర్ ఫుల్ ఆధీరా పాత్రలో కనిపించాడు. భయంకరమైన ఆధీరా లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో సంజయ్ దత్ కు మంచి పేరు వచ్చింది. బాలీవుడ్ లో పవర్ ఫుల్ విలన్ పాత్రలు చేయడానికి మేకర్స్ ముందుకు సంజయ్ దత్ కనిపించాడు. దీంతో బాలీవుడ్ లో ఈ వారం వచ్చిన షంషేరా సినిమాలో సుధ్ సింగ్ అనే పాత్రలో నటించాడు. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా, సంజయ్ దత్ పాత్ర లుక్ మాత్రం ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా సంజయ్ దత్ కు మరో పవర్ ఫుల్ విలన్ పాత్ర అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తన కెరీర్ లో 61 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హెచ్ వినోద్ దర్శకత్వంలో సూపర్ స్టైలిష్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. అలాగే బోణీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఆ పాత్ర విలన్ పాత్రేనని మరి కొంతమంది అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు