Sanktranthi 2025 : తెలుగు హీరోలకే దూరడానికి సందు లేదు… కమల్ మనకు అవసరమా..?

Sanktranthi 2025 : తెలుగు ప్రేక్షకులు సంక్రాంతి సీజన్ లో సినిమాలు ఎలా చూస్తారో అందరికీ తెలిసిన విషయమే. అందుకే చాలామంది దర్శక నిర్మాతలు సంక్రాంతి సీజన్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన అవసరం లేదు. ఏ సీజన్లో సినిమా రిలీజ్ చేసిన చేయకపోయినా కూడా ఖచ్చితంగా తన ప్రొడక్షన్ హౌస్ నుంచి సంక్రాంతికి ఒక సినిమాను రిలీజ్ చేసే పనిలో పడుతూ ఉంటారు. ఇక ఈ సంక్రాంతికి కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా కనిపిస్తున్నారు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక 2024 సంక్రాంతి సీజన్ కి సంబంధించి నా సామిరంగా అనే సినిమాతో అక్కినేని నాగార్జున బరిలోకి దిగారు. కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూడటం వలన ఈ సినిమా లాభాలు బాట పెట్టింది. సినిమా సక్సెస్ అయిన రెండు రోజుల తర్వాత నెక్స్ట్ సంక్రాంతికి మళ్లీ సినిమా వస్తుంది అని అప్పుడే అనౌన్స్ చేశారు నాగార్జున. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు వచ్చేసింది. ఈ సినిమాను జనవరి 10న రిలీజ్ చేస్తున్నామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బింబిసారా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతుంది అని అందరూ ఊహిస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా కొంచెం వర్క్ అవుట్ అయినా కూడా సంక్రాంతి లో మంచి కలెక్షన్స్ ను వసూలు చేస్తుంది. లేకపోతే ప్రతిసారి సంక్రాంతికి థియేటర్స్ విషయంలో డిస్టబెన్స్స్ జరుగుతూ ఉంటాయి. అందుకే చాలామంది ముందుగానే తమ సినిమాలను అనౌన్స్ చేస్తారు.

- Advertisement -

Thug Life

ఇప్పుడు తెలుగు సినిమాలు తో పాటు మరో తమిళ సినిమా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ అనే సినిమాను సంక్రాంతి 2025 లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సంక్రాంతి సీజన్ కి అనౌన్స్ చేసిన అన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి అనే నమ్మకాలు లేవు. ఆ టైం వచ్చేసరికి ఏదో ఒక సినిమా పోస్ట్ పోన్ అవ్వడం అనేది సహజం. ఈ సంక్రాంతికి ఏం జరుగుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు