Saripodhaa Sanivaaram : ఇదేందయ్యా ఇది… ఆ ఇద్దరి రెమ్యూనరేషన్లకే సరిపోయిన సగం బడ్జెట్!?

Saripodhaa Sanivaaram : టాలీవుడ్‌లో ఏడాదికి రెండు సినిమాలతో వస్తున్న అతి కొద్ది మంది నటుల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. ఒక్కో సినిమాలకు ఒక్కో వేరియేషన్ ఉండేలా చూసుకుంటూ, ప్రతీ సినిమాతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. నేచురల్ యాక్టర్ గా పేరుగాంచిన నాని ఇటీవల మాస్,  క్లాస్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక్కో సినిమాతో నాని బ్రాండ్ వాల్యూ, ఇమేజ్‌తో పాటు అతని రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన సరిపోదా శనివారం మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సరిపోదా శనివారం మూవీ బడ్జెట్ లో మేకర్స్ సగం బడ్జెట్ ను ఇందులో నటించిన ఇద్దరు స్టార్స్ ఖాతాలో వేశారనే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఆ ఇద్దరి రెమ్యూనరేషన్లకే సగం బడ్జెట్టా?

నేచురల్ స్టార్ నాని (Nani), వివేక్ ఆత్రేయ (Vivek Atreya) కాంబోలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం ఆగష్టు 29న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, ఎస్‌జే సూర్య (Sj Surya) విలన్ పాత్రను పోషించారు. అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై టాప్ ప్రొడ్యూసర్ దానయ్య దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాడు. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఇన్సైడ్ వర్గాలలో విన్పిస్తున్న గుసగుసల ప్రకారం సినిమాలో నటించిన ఇద్దరు స్టార్స్ కే మేకర్స్ సగం బడ్జెట్ ఖర్చు పెట్టారని సమాచారం.

Saripodhaa Sanivaaram Movie Review Rating

- Advertisement -

50 కోట్లు పారితోషికాలకే !!

హీరో నాని పారితోషికంగా 25 కోట్లు అందుకున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడున్న టైర్ 2 హీరోలలో నాని సక్సెస్ ఫుల్ హీరోనే. పైగా ఆయన సినిమా అంటే హిట్ గ్యారంటీ అనే నమ్మకంతో పాటు నానికి ఉన్న మార్కెట్ కూడా అలాంటిది. కాబట్టి ఆయన డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ కు నిర్మాతలు ఓకే చెప్పారని అంటున్నారు. ఇక విలన్ గా నటించిన ప్రముఖ తమిళ నటుడు ఎస్జె సూర్య ఖాతాలో 8 కోట్లు రెమ్యూనరేషన్ గా పడ్డాయని తెలుస్తోంది. మిగతా క్యాస్టింగ్ కు అంతా కలుపుకుని మొత్తంగా 50 కోట్లు రెమ్యూనరేషన్లకే సరిపోయాయని టాక్ నడుస్తోంది. సినిమాకు పెట్టిందే 90 కోట్లు అయితే అందులో సగం రెమ్యూనరేషన్లకే పెట్టడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సినిమాలకు భారీ బడ్జెట్ ఖర్చు కావడానికి కారణం హీరోలు అందుకునే అత్యధిక పారితోషికం అనే వాదన ఉండనే ఉంది. సరిపోదా శనివారం బడ్జెట్, రెమ్యునరేషన్ల గురించి తాజాగా జరుగుతున్న ప్రచారం ఆ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే నాని ఫ్యాన్స్ మాత్రం ఏదైతేనేం సరిపోదా శనివారం బొమ్మ బాగుంది. తమ హీరో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది అదే చాలు అని సంబరపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు