Saripodha Sanivaram: కలెక్షన్లకు బదులు, టికెట్ సేల్స్ తెలివైన ప్రమోషన్

Saripodha Sanivaram: వివేక్ ఆత్రేయ(Vivek Athreya) దర్శకత్వంలో నాని హీరోగా చేస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా కంటెంట్ కూడా సినిమా మీద మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఫస్ట్ టైం వివేకాత్రేయ తన స్టైల్ మార్చి ఒక మాస్ కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఇకపోతే రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని మంచి కాన్ఫిడెంట్ మీద ఉన్నారు చిత్ర యూనిట్.

ఈ సినిమా యుఎస్ ప్రీమియర్ కి సంబంధించి 17,000 టిక్కెట్లు సేల్ అయినట్లు ట్విట్టర్ వేదిక చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఇది ఒక కొత్త స్ట్రాటజీ అని చెప్పాలి. మామూలుగా సినిమా కలెక్షన్స్ ని బట్టి ఆ సినిమా ఎంత మేరకు హిట్ అయింది అని డిసైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా సినిమా టిక్కెట్లు ఎన్ని సేల్ అయ్యాయి అంటూ రీవీల్ చేయటం మొదలుపెట్టారు. ఈ ట్రెండ్ హనుమాన్(Hanuman) సినిమా నుంచి మొదలైంది. ఇప్పుడు 17,000 టిక్కెట్లు సేల్ అయ్యాయి అంటే ఒక టికెట్ కాస్ట్ వచ్చి దాదాపు 12 డాలర్లు ఉంటుంది. ఈ మధ్యకాలంలో కలెక్షన్ వివరాలు వేస్తే బాగోదని చెప్పి ఇలా టికెట్ సోల్డ్ అని వేస్తున్నారు. ఎంత ప్రైస్ ఏంటి అనేది చాలామందికి ఇక్కడ వాళ్లకు తెలియదు కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తున్నారు.

Saripodha Sanivaram

- Advertisement -

ఇకపోతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే కనీసం ఆఫ్ మిలియన్ కలెక్షన్ అక్కడ జరగాలి. రీసెంట్ గా చాలా క్లాస్ సినిమాలకు వన్ మిలియన్ మార్కును అక్కడ దాటుతున్నాయి. యుఎస్ లో కూడా నానికి మంచి మార్కెట్ ఉంది. నాని గత సినిమాలు కూడా అక్కడ మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఈ సినిమాకి సంబంధించి మంచి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా ఇది కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుందని చెప్పొచ్చు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు