Chiranjeevi: సీనియర్లే అదరగొడుతున్నారు..

టాలీవుడ్ లో టాప్ హీరోల నుండి వరుస సినిమాల అనౌన్స్మెంట్స్ వస్తున్నా ఏ సినిమా కూడా సరైన టైమ్ కి రాలేకపోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అయినా ఇప్పటి వరకు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ రావట్లేదు. పైగా ఆ సినిమాల షూటింగ్ ఇంకా బాకీ ఉంది. అటు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెట్టడం వల్ల ఈ సినిమాల షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటాడో చెప్పలేని పరిస్థితి.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ విడుదల కాగా, సాలార్, ప్రాజెక్ట్ కే, షూటింగ్లలో పాల్గొంటున్నా వాటి రిలీజ్ డేట్లు మాత్రం చెప్పడం లేదు. ఇవేగాక స్పిరిట్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియట్లేదు.

ఇక మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ , అల్లు అర్జున్ వీళ్ళందరూ ఒక్క సినిమా షూటింగ్ లోనే పాల్గొంటున్నారు. వాళ్ళు చేస్తున్న ఆ సినిమాల షూట్ పూర్తి అయిన తర్వాతే వేరే సినిమాలు అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరం ఈ నలుగురి స్టార్ హీరోల సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు, కావు కుడా, 2024 లోనే వీళ్ళ సినిమాలు వస్తాయి.

- Advertisement -

అయితే సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారు. ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఏడాది గ్యాప్ లో మూడు సినిమాలు విడుదల చేయగా, మళ్ళీ భోళా శంకర్ గా అగస్ట్ 11న రానున్నాడు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ తో ఓ సినిమా, బింబిసార ఫేమ్ వశిష్ఠ తో కూడా ఒక సినిమా చేస్తున్నారు.

ఇక నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది వీరసింహారెడ్డి తో హిట్ కొట్టగా దసరా కి “భగవంత్ కేసరి” గా వస్తున్నాడు. ఆ తరువాత బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తారు. విక్టరీ వెంకటెష్ 2022లో ఎఫ్3, ఓరి దేవుడా సినిమాలతో ముందుకు రాగా, ఈ ఏడాది ఓటిటి లో రానా నాయుడుతో పలకరించగా, హిందీలో “కిసి కా భాయ్ కిసి కా జాన్” సినిమాలో నటించాడు. ఇక క్రిస్మస్ కి “సైంధవ్” తో వస్తున్నాడు. ఇలా సీనియర్ హీరోలందరూ ఏడాదికి రెండు సినిమాల చొప్పున రిలీజ్ చేస్తూ దూసుకుపోతుంటే, యంగ్ స్టర్స్ మాత్రం ఇయర్ కి ఒక్క సినిమా రిలీజ్ చేయడానికే కష్టపడుతున్నారు. సీనియర్లను చూసైనా సినిమాలు ఎలా చేయాలో టాలీవుడ్ హీరోలను నేర్చుకొమ్మని విమర్శకులు అంటున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు