Raj Tarun Case : రాజ్ తరుణ్ నిజంగానే తప్పు చేశాడా..? తాజా పరిణామాలతో ఇదే స్పష్టమవుతుంది

Raj Tarun Case : హీరో రాజ్ తరుణ్ పై ఆయన ప్రేయసి లావణ్య పెట్టిన కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.. లావణ్య ఆరోపణలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆమెపై పలు ఆరోపణలు చేసి కేసు పెట్టినా కానీ లావణ్య మాత్రం అతనే కావాలని కోరుకుంటోంది.. అతన్ని దక్కించుకోవడం కోసం ఏదైన చేస్తానని అంటుంది.. ఈ కేసు వల్ల ఎక్కువగా మీడియా ముందుకు రాలేక పోతున్నాడు.. ప్రస్తుతం అతని పరిస్థితి దారుణంగా ఉంది.. తాను నటించిన సినిమాల ఫంక్షన్లకు హాజరు కాలేదు.. దీంతో సోషల్ మీడియాలో మరో వార్త వినిపిస్తుంది..

Sensational news on Raj Tarun - Lavanya Case

ప్రస్తుతం రాజ్‌తరుణ్‌ పరిస్థితి చిత్ర విచిత్రంగా ఉంది. ఎటూ అడుగేయలేని స్థితిలో ఉన్నాడు. బలంగా పోరాటం చేయలేకపోతున్నాడు.. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు న్యాయం చేయలేకపోతున్నాడు.. ఈయన నటించిన సినిమాలు రెండు తిరగబడరా సామి, పురుషోత్తముడు సినిమాలు కేవలం ఒక్కవారం గ్యాప్ లోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాల గురించి జనాలకు తెలియాలంటే హీరో ఖచ్చితంగా మీడియాతో మాట్లాడాలి.. కానీ ఎక్కడ బయటకు వచ్చినట్లు కనిపించలేదు..

- Advertisement -

రాజ్ తరుణ్ కు మొత్తంగా చూసుకుంటే లైఫ్ అండ్ డెత్ గా మారింది.. చాలా కాలంగా సరైన సినిమా లేక ఖాళీగా ఉన్న రాజ్‌తరుణ్‌కి ఇది చాలా కీలకమైన సమయం. ఈ రెండు సినిమాల విజయాన్ని బట్టే అతని కెరీర్‌, హీరోగా మార్కెట్‌ ఉంటుంది. ఇప్పుడు లావణ్య పెట్టిన కేసులతో అతని సినీ కేరీర్ ఎండ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది.. మొన్న రాజ్ తరుణ్ హీరోగా చేసిన పురుషోత్తముడు ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌ లో ఓ హోటెల్‌ లో జరిగింది. ఈ కార్యక్రమం హీరో లేకుండానే జరిగింది. ఇంటర్వ్యూలోనూ రాజ్‌ తరుణ్‌ దర్శనం లేదు.. నిర్మాతలు పెద్దగా మాట్లాడలేదు..

లావణ్య అతని పై కేసు పెట్టిన తర్వాత ఒకసారి మీడియా ముందుకు వచ్చి నేను తప్పుచెయ్యలేదని చెప్పాడు.. ఆ తర్వాత తన ఫ్రెండ్ శేఖర్ భాష రాజ్ తరుణ్ కు సపోర్ట్ చేస్తూ మీడియా ముందుకు వచ్చి చెప్పాడు.. ఇప్పుడు సినిమాల కోసం కూడా బయటకు రాకపోవడం తో రాజ్ తరుణ్ నిజంగానే తప్పు చేశాడా? ఆ ఎఫైర్స్ కూడా ఉన్నాయా? తప్పు చెయ్యకుంటే ఎందుకు అతను సినిమా ఈవెంట్స్ హాజరు కాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. వీటిపై హీరో మౌనం వీడతాడా? అసలు నిజం బయటపెడతాడా?లేక జైలుకు వెళ్తాడా? అనేది తెలియాలంటే రాజ్ తరుణ్ బయటకు రావాల్సిందే..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు