Shah rukh khan’s Jawan : అట్లీని చూసి బుద్ది తెచ్చుకోండి..

Shah rukh khan’s Jawan

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా జవాన్ ఈరోజు(సెప్టెంబర్ 7) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ తో థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్షింపబడుతోంది. గౌరీ ఖాన్ నిర్మాణంలో వచ్చిన ఈ జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించాడు.

ఇక ప్రస్తుతం జవాన్ సినిమా గురించి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేంటంటే నిజానికి జవాన్ సినిమాలో అట్లీ కొత్తగా చెప్పిన పాయింట్ ఏది లేకపోయిన. స్క్రీన్ ప్లే తో మాత్రం డైరెక్టర్ అట్లీ మ్యాజిక్ చేసాడని మాట్లాడుకుంటున్నారు. గతంలో అట్లీ దర్శకత్వంలో వచ్చిన తేరి, మెర్సల్, బిగిల్ సినిమాల కథలన్నిటిని కలిపి జవాన్ సినిమా చేసినట్టుగా ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే అట్లీ మేజర్ గా జవాన్ సినిమా కథ కంటే కూడా సినిమాలో ఉండే ఎమోషన్ మరియు ఎలివేషన్స్ విషయంలో అట్లీ జాగ్రత్తలు తీసుకున్నదంటూ ఆయనకు ప్రశంషలు వస్తున్నాయి.

ఇక అట్లీ తో పలు తెలుగు దర్శకులను కంపేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో పలు మీమ్స్ మరియు ట్రోల్ల్స్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి. అట్లీని చూసి చాలా మంది తెలుగు దర్శకులు బుద్ది తెచ్చుకోవాలంటూ మీమ్స్ వేస్తున్నారు. ప్రతి సినిమాకు అట్లీ తన స్థాయిని పెంచుతూ వెళ్తున్నాడని ప్రశంసిస్తున్నారు. అయితే అట్లీ ను ఈ రేంజ్ లో పొగడటానికి కారణం ఆయన నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో చేయబోతుండటమే టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు