Game Changer: శంకర్ బిజీ అని శైలేష్ కొలను తో, తమన్ బిజీ అని శ్రీకృష్ణతో అసలు గేమ్ చేంజర్ కి ఏం జరుగుతుంది.

Game Changer: ప్రస్తుతం ఇండియన్ ఆడియన్స్ అంతా కూడా ఇండియన్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న గేమ్ చేంజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దీని కారణం రామ్ చరణ్ తేజ్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం శంకర్ వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్నాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఇండియన్ 2 సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేదు. ఇకపోతే అందరికీ గేమ్ చేంజర్ సినిమా పైన నమ్మకాలు ఉన్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో అందరూ చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా దాదాపు 3 ఏళ్ల క్రితం మొదలైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా 50వ సినిమాగా వస్తుంది అని అనౌన్స్ చేశారు. కానీ ఈ 50వ సినిమా ఇంకా పెండింగ్ లోనే ఉంది కానీ బ్యానర్ మాత్రం 58వ సినిమాను పూర్తి చేసింది. ఎప్పుడు ప్లానింగ్, పద్ధతి, విజన్ అనే దిల్ రాజు కూడా ఈ సినిమాకి దర్శకుడు శంకర్ కావడంతో ఏమీ అనలేకపోయారు. అత్తారింటికి దారేది సినిమాలో రావు రమేష్ చెప్పినట్లు ఇప్పటికీ 30 దీపావళిలు వెళ్లాయి కానీ మా బావ ఇంకా రాలేదన్నట్లు ఇప్పటికీ నాలుగు సంక్రాంతి పండుగలు దాటిపోయాయి ఈ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు.

Game Changer

- Advertisement -

ఇకపోతే ఈ సినిమా గురించి ఫ్యాన్స్ చాలా అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే భారతీయుడు టు సినిమా షూటింగ్ పనుల్లో శంకర్ కొంచెం బిజీగా ఉన్నప్పుడు శైలేష్ గేమ్ చేంజెర్ సినిమాకి సంబంధించిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాడు అని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ తన సినిమాలో పాటలను దగ్గరుండి పాటించడం అనేది జరుగుతుంది. కానీ గేమ్ సినిమాకు సంబంధించి సింగర్ కృష్ణ చైతన్య జరగండి పాటను మరో సింగర్ తో పాటించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.శంకర్ బిజీ అని శైలేష్ కొలను తో, తమన్ బిజీ అని శ్రీకృష్ణతో అసలు గేమ్ చేంజర్ కి ఏం జరుగుతుంది. అంటూ సోషల్ మీడియా వేదిక పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు