Sharukh Khan: ఆ భాగానికి ఆపరేషన్.. సక్సెస్ కావాలంటున్న ఫ్యాన్స్.!

Sharukh khan.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈయన తనకు సంబంధించిన ఏ చిన్న విషయాన్నైనా సరే అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అంతే కాదు ఈయన గురించి ఏ చిన్న వార్త వచ్చినా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. అంత పాపులారిటీ సంపాదించుకున్నారు షారుఖ్ ఖాన్. ఇదిలా ఉండగా తాజాగా ఈయన ఇటీవల యూకే నుండి వచ్చిన విషయం తెలిసిందే. అయితే హఠాత్తుగా అత్యవసరంగా యూఎస్ఏ కి వెళ్తున్నట్టు తెలుస్తోంది .దీంతో అసలు ఏమైందని అభిమానులు ఆరా తీయగా.. ఈయన కంటి సమస్యతో బాధపడుతున్నారట .ముంబైలోని ఒక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళగా, డాక్టర్ అమెరికాకు రిఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక జూలై 30వ తేదీన అంటే నేడు షారుక్ ఖాన్ కంటి ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం.

Sharukh Khan: Operation for that part.. Fans want success!
Sharukh Khan: Operation for that part.. Fans want success!

కంటి ఆపరేషన్ కోసం అమెరికాకు..

ఇప్పటికే 2014లో ఈయనకు కంటి ఆపరేషన్ జరిగింది.. అయితే మళ్లీ ఆ సమస్య పునరావృతం అయినట్లు సమాచారం.. అందుకే ఇప్పుడు అమెరికాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ ఇంకా ధ్రువీకరించలేదు. మరొకవైపు ఈ సంవత్సరం ప్రారంభంలోనే హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ కారణంగా ఈయన గుజరాత్ లోని అహ్మదాబాద్ ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికా లోని ఆసుపత్రికి వెళుతుండడంతో ఈ సంవత్సరం షారుఖ్ ఖాన్ కి అంతగా కలిసి రాలేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు కంటి ఆపరేషన్ త్వరగా జరిగి , ఆపరేషన్ సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నారు.

షారుఖ్ ఖాన్ సినిమాలు..

ఇక షారుక్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. జవాన్, పఠాన్ సినిమాలతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు షారుక్ ఖాన్. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాలు బోల్తాపడ్డాయి. ఇప్పుడు తన కూతురు సుహానా ఖాన్ , అభిషేక్ బచ్చన్ తో కలిసి తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆదిత్య చోప్రా తెరకేక్కించే టైగర్ వర్సెస్ పఠాన్ లో కూడా షారుక్ ఖాన్ పఠాన్ పాత్రను తిరిగి పోషించనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే ఈ విషయాలపై పూర్తి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

- Advertisement -

ఆస్తులు కూడబెట్టడంలో వారసులు కూడా దిట్ట..

ఇక ప్రస్తుతం షారుక్ ఖాన్ వ్యక్తిగత కెరియర్ విషయానికి వస్తే.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచిన ఈయన.. ఈ మధ్యకాలంలో ఆస్తులు మరింతగా కొనుగోలు చేస్తున్నారు అని చెప్పవచ్చు.. ఈయన కొడుకు ఆర్యన్ ఖాన్ తోపాటు కూతురు సుహానా ఖాన్ కూడా ఆస్తులు కూడబెట్టడంలో ముందున్నారు ..ఈ మధ్యకాలంలోనే వీరిద్దరూ కూడా కోట్లు విలువచేసే ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు సుహానా ఖాన్ వరుస సినిమాలతో దూసుకుపోతుండగా, త్వరలోనే ఆర్యన్ ఖాన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఏది ఏమైనా వంశపారపర్యంగా ఆస్తులను కూడబెడుతూ మంచి హోదా దక్కించుకుంటున్నారు షారుక్ ఖాన్

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు