Sharukh Khan : చెపాక్ లో కింగ్ ఖాన్.. చేతికున్న వాచ్ విలువ తెలుసా!

Sharukh Khan : బాలీవుడ్ లో కింగ్ ఖాన్ గా మూడు దశాబ్దాలు గా ఇండస్ట్రీని ఏలుతున్న షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు హిట్ల మీద హిట్లు కొట్టి నెంబర్ వన్ హీరోగా బాలీవుడ్ ని ఏలిన ఈ బాక్స్ ఆఫీస్ ‘బాద్ షా’ దాదాపు ఎనిమిదేళ్ల పాటు సరైన సినిమా లేక డీలా పడ్డాడు. ఎన్ని సినిమాలు చేసినా, ప్రయోగాలు చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. తన తోటి హీరోలు వరుస బ్లాక్ బస్టర్లు కొడుతూ ఉంటే షారుఖ్ మాత్రం ఓ మోస్తరు సినిమా కూడా అందించలేకపోయాడు. పైగా యంగ్ హీరోలు కూడా ఓ దశలో షారుఖ్ ని మార్కెట్ ని అధిగమించేసారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ కి “పఠాన్” సినిమా ఊపిరి పోసింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా ఎవరికీ సాధ్యం కానీ రేంజ్ లో 1000 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా గాలివాటం అని అనుకున్నా, ఆ వెంటనే మళ్లీ “జవాన్” సినిమా తో షారుఖ్ తన క్రేజ్ ఏంటో చూపించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1100 కోట్లు కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ అయింది. ఇక దీని తర్వాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో చేసిన డుంకి విమర్శల ప్రశంసలు సైతం అందుకుని ఏకంగా 700 కోట్లు వసూలు చేసింది. ఇక సినిమాల్లోనే కాకుండా ఈ ఏడాది ఐపీఎల్ లో కూడా షారుఖ్ ఖాన్ టీమ్ సత్తా చాటింది.

Sharukh Khan's watch is worth 4 crores

చెపాక్ లో అదరగొట్టిన షారుఖ్ టీం..

ఇక షారుఖ్ ఖాన్ (Sharukh Khan) సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఐపీఎల్ లోనూ విజయపరంపర ని కంటిన్యూ చేస్తున్నాడు. కింగ్ ఖాన్ ఐపీఎల్ క్రికెట్ లో “కోల్కథా నైట్ రైడర్స్” కి యజమాని గా ఉన్నాడు. ఇదిలా ఉండగా మొన్న (మే 26) జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ తో తలపడిన కోల్ కతా టీం ఫైనల్ లో సునాయాసంగా మ్యాచ్ గెలిచి ఐపీఎల్2024 కప్ గెలుచుకుంది. ఇక మ్యాచ్ గెలవగానే గ్రౌండ్ లోకి వచ్చి కెకేఆర్ టీం యజమాని షారుఖ్ ఖాన్ సంబరాలు చేసాడు. ఇక షారుఖ్ ఖాన్ చెపాక్ స్టేడియం లో అందరికి కృతజ్ఞతలు చెప్పగా, ఇక్కడ షారుఖ్ ఖాన్ ధరించిన వాచ్ మాత్రం వైరల్ అయింది.

- Advertisement -

చేతికున్న లగ్జరీ వాచ్ విలువ తెలుసా!

తాజాగా ఐపీల్ 2024 టైటిల్ ను కోల్ కత నైట్ రైడర్స్ మూడోసారి గెలుచుకోగా, KKR యజమాని షారుఖ్ ఖాన్ ఆటగాళ్లు అందరితో కలిసి కెమెరా ముందు ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చారు. ఈ జట్టు గతంలో 2012, 2014లో చాంపియన్‌గా నిలవగా, మళ్ళీ పదేళ్ల తర్వాత ఛాంపియన్ గా నిలిచి కప్ గెలుచుకుంది. ఈ సంధర్భంగా షారుక్ ఖాన్ చేతికి ఉన్న వాచ్ ను చూసి మరో సారి దాని ఖరీదు గురించి చర్చ వచ్చింది. షారుఖ్ చేతికి ఉన్న వాచ్ ‘రిచర్డ్ మిల్ RM 052’ ‘టూర్‌బిల్లాన్ స్కల్ టైటానియం’ అందరి దృష్టిని ఆకర్షించింది. 2012లో నమోదయిన దీని విలువ దాదాపు రూ.4.15 కోట్లు అని తెలుస్తున్నది. షారుఖ్ వాచ్ విలువతో సిటీ లో ఒక లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేయవచ్చని నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక కింగ్ ఖాన్ ప్రస్తుతం తన కూతురు సుహానా ఖాన్ ని హీరోయిన్ గా పరిచయం చేసే పనిలో ఉన్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు