Ram Charan Director: రామ్ చరణ్ దర్శకుడికి అవకాశం ఇచ్చిన శర్వానంద్

Ram Charan Director: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో సంపత్ నంది ఒకరు. మొదట రామ్ చరణ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ అప్పటికే రామ్ చరణ్ కి మగధీర సినిమాతో మంచి క్రేజీ వచ్చేసింది. సో ఉన్నఫలంగా కొత్త డైరెక్టర్ తో సినిమా చేయడం కరెక్ట్ కాదు అని అనుకుని ముందు ఒక చిన్న కథ చేసిన తర్వాత ఈ కథ మనం చేద్దామని రామ్ చరణ్ చెప్పాడట. అప్పుడు సంపత్ నంది ఏమైంది ఈవేళ అనే సినిమాను వరుణ్ సందేశ్ తో తెరకెక్కించి డీసెంట్ హిట్ అందుకొని చరణ్ రచ్చ సినిమాను చేశాడు.

అప్పటికే ఆరెంజ్ సినిమా తర్వాత ప్లాప్ లో ఉన్న చరణ్ కి రచ్చ సినిమాతో మంచి హిట్ అందింది. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ను చాలా ఎనర్జీతో చూపించాడు సంపత్ నంది. ఈ సినిమాలో మెగాస్టార్ మేనరిజం కూడా చాలా వరకు చూపించాడు సంపత్. ఇకపోతే రవితేజ గోపీచంద్ అండ్ హీరోలతో సినిమాలు చేసి మంచి హిట్స్ అందుకున్నాడు. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ తో కూడా సంపత్ నంది సినిమా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి అది కుదరలేదు. సంపత్ నంది చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన కూడా ఇప్పటికీ చాలామందికి నచ్చుతాయి అని చెప్పొచ్చు.

Sharwanand

- Advertisement -

చివరగా సిటిమార్ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు సంపత్ నంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ఓదెల టు అనే సినిమాను చేస్తున్నాడు సంపత్ నంది. దీని తర్వాత సంపత్ నంది శర్వానంద్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి కేకే రాధా మోహన్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిందని త్వరలో దీని గురించి అధికారిక ప్రకటన రానుంది అని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు