Sharwanand : ‘మనమే’ హిట్ అయితే రెమ్యూనరేషన్ పెంచేద్దాం అనుకున్నాడట..!

Sharwanand : కొన్నాళ్లుగా టాలీవుడ్లో ఉన్న మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి ఏమాత్రం బాలేదు. ‘వాళ్ళ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడుతున్నాయా? లేదా?’ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే.. కనీసం వాళ్ళ సినిమాలకి ఓటీటీ రైట్స్ బిజినెస్ కూడా జరగడం లేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీ ఊహలకే వదిలేస్తున్నా..! సరైన కంటెంట్ ఉంటేనే.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్నారు. కాబట్టి.. ఆ కంటెంట్ పై వాళ్ళు దృష్టి పెట్టి సినిమాలు చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ చూస్తుంటే మన టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోలు కాస్త అత్యాశకి పోతున్నట్టు కనిపిస్తుంది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఆడుతుందా లేదా అనే విషయాలు పట్టించుకోకుండా తమ పీఆర్ సర్కిల్ ఉపయోగించి.. పెయిడ్ రివ్యూలు రాయించుకుని,వాటి ద్వారా వీకెండ్ వరకు సినిమా హిట్ అనే భజన కొట్టించుకుని.. పారితోషికం పెంచేయాలని చూస్తున్నారు ఆ మిడ్ రేంజ్ హీరోలు. ఈ లిస్ట్ లో ఇప్పటికే చాలా మంది హీరోలు ఉన్నారు. తాజాగా శర్వానంద్ కూడా చేరినట్టు టాక్.

విషయంలోకి ఇంకా డీప్ గా వెళ్తే.. శర్వానంద్ నుండి మొన్నామధ్య వచ్చిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి. అయితే ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమా ఓ మోస్తరుగా ఆడింది. దీని తర్వాత ‘మనమే’ అనే సినిమా చేశాడు శర్వానంద్. ఈ సినిమా ప్రమోషన్స్ లో తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయిన ‘శతమానం భవతి’ రేంజ్లో ఉంటుంది అని డబ్బా కొట్టుకున్నాడు. కానీ జూన్ 7న విడుదలైన ఈ సినిమా ఆ స్థాయిలో లేదు. అయినప్పటికీ శర్వానంద్ తన పీఆర్ సర్కిల్ వాడి కొన్ని వెబ్ సైట్స్ లో పెయిడ్ రివ్యూస్, రేటింగ్స్ వేయించుకున్నాడట. ‘ఆదివారానికి పారితోషికం పెంచేద్దాం’ అని అన్ని పనులు చక్కబెట్టుకున్నాడట. కానీ మౌత్ టాక్ ముందు పెయిడ్ రివ్యూలు నిలబడవు కదా. అందుకే ‘మనమే’ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ వీకెండ్ వరకే పరిమితమైంది. సోమవారం నుండి చేతులెత్తేసింది.

విషయం టాలీవుడ్ నిర్మాతలందరికీ తెలిసిపోయింది. ఈ క్రమంలో శర్వానంద్ ఎక్కువ పారితోషికం ఇవ్వాలని తమ మేనేజర్ తో చెప్పించడం.. వాళ్ళు ‘మీ వాడి డేట్స్ మాకొద్దులే బాబోయ్’ అని సైడ్ అయిపోవడం జరిగిపోయాయట.

- Advertisement -

మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తాడని శర్వానంద్ కి మంచి పేరు ఉంది. కానీ ఆయన ఒరిజినల్ లెక్కలు వేరు. ప్రస్తుతం అతనికి రూ.8 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నారు నిర్మాతలు. అది సరిపోదని.. ‘ ‘మనమే’ కనుక హిట్టైతే దానిని రూ.15 కోట్లకి పెంచేద్దాం’ అని అతను అనుకున్నాడట. కానీ సీన్ రివర్స్ అయిపోయింది.

– Kumar Naidu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు