SonakshiSinha Marriage : సోనాక్షి సిన్హా పెళ్లి తండ్రికే తెలీదా…?

SonakshiSinha Marriage : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీనియర్ స్టార్ శత్రుఘ్న సిన్హా కూతురుగా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుస హిట్లతో దూసుకుపోయిన ఈ భామ, ఆ తర్వాత పరాజయాలతో నెమ్మదించింది. ఇక ఇప్పుడు అడపాదడపా సినిమాల్లో అలరిస్తూనే ఉంది. రీసెంట్ గా హీరమండి లో సెకండ్ లీడ్ లో చక్కని నటనతో ప్రేక్షకులని మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. ఇదిలా ఉండగా బాలీవుడ్‌ లో కొద్ధి రోజులుగా స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా పెళ్లి వార్తలు బాలీవుడ్ మీడియాలో గత వారం పది రోజులుగా తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 23న జహీర్ ఇక్బాల్ ను సోనాక్షి పెళ్లి చేసుకోబోతుంది అంటూ వస్తున్న వార్తలు దాదాపుగా కన్ఫర్మ్‌ అన్నట్టుగా ఆమె సన్నిహితులు, స్నేహితులు మాట్లాడుతున్నారు. ఈ సమయంలో సోనాక్షి సిన్హా తండ్రి, సీనియర్‌ స్టార్‌ అయిన శత్రుఘ్న సిన్హా మాత్రం తన కూతురు వివాహం గురించి ఇంకా నాకే తెలియదు అన్నాడు.

Shatrughan Sinha reacts to the news of Sonakshi Sinha's marriage

సోనాక్షి సిన్హా పెళ్లి వార్తలపై స్పందించిన శత్రుఘ్న సిన్హా..

ఇక సోనాక్షి సిన్హా పై వార్తలపై స్పందించిన శత్రుఘ్న సిన్హా జాతీయ మీడియాలో వస్తున్న వార్తలపై నేను స్పందించలేను అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. సోనాక్షి తన పెళ్లి (SonakshiSinha Marriage) విషయాన్ని, ప్రేమ విషయాన్ని కుటుంబంలో ఇంకా చర్చించలేదు. అయితే ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తప్పకుండా మా అందరి మద్దతు ఉంటుంది. సోనాక్షి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా సార్లు ఆలోచించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది. కనుక పెళ్లి విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పెళ్లి విషయంలో సోనాక్షి తీసుకునే నిర్ణయాన్ని తను మరియు తన భార్య ఆశీర్వదిస్తామని శత్రఘ్న సిన్హా అన్నారు. అయితే ఇప్పటి వరకు మీకు తెలియక పోవడం ఏంటి అంటూ మీడియా వారు ఆయనను ప్రశ్నించగా, అందుకు ఆయన సమాధానం చెప్పలేదు.

- Advertisement -

అటు తండ్రి.. ఇటు కూతురు బిజీ బిజీ…

ఇక తండ్రి శత్రుఘ్న సిన్హా ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున అసన్సోల్ నియోజక వర్గం లో ఎంపీ పోటీ చేసి రీసెంట్ గా గెలిచారు. కాగా గత పాతికేళ్ళగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు శత్రుఘ్న సిన్హా. ఇక
బాలీవుడ్‌ లో ఇటీవల సోనాక్షి సిన్హా హీరామండి సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది. అలాగే అక్షయ్ కుమార్, ఇంకా అజయ్ దేవగన్ వంటి సీనియర్ హీరోల సినిమాలు హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. ఇక మళ్లీ హీరోయిన్ గా సోనాక్షి సిన్హా బిజీ అవ్వబోతుంది అనుకుంటున్న సమయంలో ఇలా అనూహ్యంగా పెళ్లి ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉంది అంటూ ఆమె ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై సోనాక్షి సిన్హా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు