Siddharth Remuneration : భారతీయుడు 2 కోసం సిద్ధార్థ్ జేబులో పడింది ఇంతేనా? ఆయన కంటే రకుల్ నయం

Siddharth Remuneration : విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ భారతీయుడు 2. దాదాపు 6 ఏళ్ల క్రితం మొదలైన ఈ మూవీ షూటింగ్ ఎన్నో అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు జూలై 12న ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా దెబ్బ పడింది. ముఖ్యంగా ఆడియన్స్ చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే ఇండియన్ 2 సినిమాలో శంకర్ మార్క్ మిస్ అయింది. ఈ నేపథ్యంలోనే మొదటిరోజు ఈ మూవీ కేవలం 26 కోట్లు మాత్రమే రాబట్టి మేకర్స్ ను నిరాశకు గురిచేసింది. దీంతో సినిమా బడ్జెట్ తో పాటు నటీనటులకు ఇచ్చిన రెమ్యూనరేషన్ గురించి చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఇందులో సిద్ధార్థ తీసుకున్న రెమ్యూనరేషన్ పై చర్చ నడుస్తోంది. మరి ఇంతకీ ఈ టాలెంటెడ్ హీరో ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నాడో తెలుసుకుందాం.

సిద్ధార్థ్ రెమ్యూనరేషన్ ఇంతేనా?

ఇండియన్ 2 మూవీ కోసం కమల్ హాసన్ తన కెరీర్లోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్నారు అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్ ఆయనకి 150 కోట్లు పారితోషకంగా ఇచ్చిందని జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం లాభాల్లో వాటా లేదా డిజిటల్ హక్కులతో పాటు దాదాపు 100 కోట్లు ఆయన పారితోషికంగా అందుకున్నట్టు తెలుస్తోంది. కమల్ తో పాటు ఈ మూవీ కోసం అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్నది డైరెక్టర్ శంకరే. ఈ మూవీ కోసం ఏకంగా 50 కోట్లు ఆయన ఖాతాలో పడ్డాయని సమాచారం. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సిద్ధార్థ పారితోషికం గురించి. ఈ హీరో ఈ సినిమా కోసం కేవలం 4 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ఉంది. ఈ బ్యూటీ 2 కోట్లు, ఎస్జె సూర్య జస్ట్ అతిథి పాత్రలో నటించినందుకు 50 లక్షలు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ 10 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.

దీంతో రెమ్యూనరేషన్ విషయమంలో సిద్ధార్థ్ కంటే అనిరుధ్ రవిచంద్రన్, రకుల్ నయం అంటున్నారు నెటిజన్లు. సినిమాలో కమల్ తరువాత ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించింది సిద్ధార్థ్. పైగా ఇదొక పాన్ ఇండియా మూవీ. అయినప్పటికీ ఆయనకు ఇంత తక్కువ రెమ్యూనరేషన్ అందడం నిజంగా ఆశ్చర్యకరం. పైగా హీరో కంటే ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్ సంపాదించడం మరో వింత. డిమాండ్ ను బట్టే పారితోషికం ఉంటుందనేది నిజమే అయినప్పటికీ సిద్ధార్థ లాంటి టాలెంటెడ్ నటుడు ఇంత తక్కువ మొత్తంలో తీసుకోవడం విడ్డూరమే. ఈరోజుల్లో అసలు వరుస ప్లాప్స్ అందుకుంటున్న చాలామంది హీరోలే 25 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Director Shankar on ‘Indian 2’, challenges of a sequel, employing new technology and more

కమల్, శంకర్ కే సగానికి పైగా బడ్జెట్

కాగా సినిమా బడ్జెట్ 250 కోట్లు కాగా, అందులో చాలావరకు స్టార్స్ రెమ్యూనరేషన్లకే సరిపోయింది. కమల్ 150, శంకర్ కి 50, అనిరుధ్ కి 10, మిగతా స్టార్ కాస్ట్ కి దాదాపు 15 కోట్లు. అందుకేనేమో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు