Jack : అప్పుడే రిలీజ్ డేట్ కూడా ఫిక్సయ్యారు?

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన సిద్ధూ జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లయినా మంచి హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా టైం పట్టింది. చిన్న చిన్న పాత్రలతో ఇండస్ట్రీ కి వచ్చిన ఈ గ్లామర్ బాయ్ డీజే టిల్లు తో ఓవర్ నైట్ స్టార్ డమ్ ని తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఇప్పుడు బిజీ అయ్యాడు. ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు సీక్వెల్ రిలీజ్ కి రెడీ అవుతుంది. మార్చి 29న రిలీజ్ చేస్తుండగా, ఆ మూవీ ప్రమోషన్లలో సిద్ధూ బిజీగా ఉన్నాడు. అయితే సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రాబోయే సినిమాల్లో SVCC బ్యానర్ లో తెరకెక్కుతున్న ‘జాక్’ సినిమా కూడా ఒకటి. ఈ బ్యానర్ లో సిద్ధూ చేస్తున్న సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే మెప్పించగా, సిద్ధూ పోస్టర్ లో గన్ పట్టుకుని బ్యాక్ నుండి ఉన్న స్టిల్ వదిలారు. ఇక తాజాగా ఈ సినిమా పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

రిలీజ్ డేట్ అప్డేట్..

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న జాక్ సినిమాను ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు బొమ్మరిల్లు భాస్కర్ తీసిన రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన సిద్ధూ పదేళ్ల తర్వాత అదే భాస్కర్ సినిమాలో హీరోగా నటిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమా గురించి తాజాగా రిలీజ్ డేట్ అప్డేట్ వచ్చింది. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న జాక్ సినిమాను జులై 4న రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాపై క్రేజీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్టు జాక్ సినిమాపై ఓవర్సీస్ లో మంచి బిజినెస్ జరుగుతుంది. ఇక తెలుగు సినిమాలకు ఓవర్సీస్ అడ్డా అయిన అమెరికా ఇండిపెండెన్స్ డే జులై 3న ఉండడంతో జాక్ సినిమాకి ఓపెనింగ్స్ పరంగా అడ్వాంటేజ్ గా మారనుంది. అయితే ఈ రిలీజ్ డేట్ పై మేకర్స్ నుండి అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న జాక్ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది.

- Advertisement -

ఇక సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న డీజే టిల్లు స్క్వేర్ మార్చి 29న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రొమాంటిక్ కామెడీ ఆక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే మంచి హైప్ ని తీసుకురాగా, త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా పెట్టబోతున్నారు. ఇక ఈ సినిమా హిట్ అయితే సిద్ధూ రాబోయే చిత్రమైన జాక్ పై మరింత అంచనాలు పెరిగి భారీ బిజినెస్ జరిగే అవకాశం ఉంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు