Chinmayi : మన్సూర్ కు సపోర్టా? ఇక ఈ స్టార్ సింగర్ కు మూడినట్టే !

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష, సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ వివాదం ఎలాంటి దుమారం రేపుతుందో అందరికీ తెలిసింది. త్రిషను రేప్ చేసే సీన్ ఉంటుంది అనుకున్నాను అంటూ మన్సూర్ చేసిన వ్యాఖ్యలను త్రిషతో పాటు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులంతా ఖండిస్తూ, త్రిషకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అయితే మన్సూర్ తానేమి తప్పుగా మాట్లాడలేదని, త్రిష కు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని అనడంతో ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలి వానలా మారిపోయింది. ఖుష్బూ, రోజా లాంటి సీనియర్ హీరోయిన్లు మన్సూర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ సైతం సుమోటాగా మన్సూర్ పై కేసు నమోదు చేసింది. అయితే తాజాగా ఈ వివాదంపై వివాస్పద సింగర్ చిన్మయి డిఫరెంట్ గా స్పందించింది.

ప్రముఖ తమిళ నటుడు రాధా రవి గతంలో ఒక ఈవెంట్ లో ఐశ్వర్యరాయ్ మీద ఇలాగే వెకిలి కామెంట్స్ చేశాడంటూ ఓ వీడియోను బయటపెట్టింది. అందులో రాధా రవి తనకు హిందీ రాదని, వచ్చి ఉంటే ఐశ్వర్యారాయ్ ని రేప్ చేసి ఉండేవాడిని, అక్కడి వాళ్ళు ఎలాగూ తనకు మంచి పాత్రలు ఇచ్చేవారు కాదు కదా…

అలాంటి రేప్ చేసే పాత్రలే తనకు వచ్చేవి అన్నట్టుగా చెబుతూ ఓ పనికిమాలిన జోక్ వేశాడు. పైగా ఆ మాటలను జోక్ గా తీసుకుని అక్కడ వారంతా నవ్వారు. ప్రస్తుతం వివాస్తదమైతున్న మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యల మీద అందరూ ఫైర్ అవుతున్నారు. వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నారు. కానీ రాధా రవి మీద మాత్రం ఎవ్వరు ఎలాంటి రియాక్షన్ తీసుకోలేదు ఎందుకు అనేది నాకు అర్థం కావడం లేదు? అంటూ చిన్మయి ప్రశ్నించింది.

- Advertisement -

మీటూ ఉద్యమం ఊపందుకున్న సమయంలో చిన్మయికి, రాధా రవికి మధ్య ఎలాంటి వివాదం నడిచిందో అందరికీ తెలిసిందే. రాధా రవి తనను లైంగికంగా వేధించాడంటూ చిన్మయి పోరాటం చేసినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు సరి కదా… ఆమెనే కోలీవుడ్ నుంచి బ్యాన్ చేశారు. దీంతో మన్సూర్ అలీ ఖాన్ కూడా రాధా రవి లాగే కామెంట్స్ చేశాడు, అయినప్పటికీ రాధా రవిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ అతన్ని ఈ వివాదంలో లాగింది చిన్మయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం చిన్మయి చేసిన కామెంట్స్ మన్సూర్ ను సపోర్ట్ చేసినట్టుగా ఉన్నాయి. ఎందుకంటే ఆమె రాధ రవి కామెంట్స్ ను తెరపైకి తీసుకు వచ్చిందే తప్ప, మన్సూర్ పై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో ప్రస్తుతం చిన్మయి చేసిన కామెంట్స్ వైరల్ గా మారగా, త్రిష అభిమానులు మాత్రం ఈ స్టార్ సింగర్ పై గుర్రుగా ఉన్నారు. త్రిష ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేసే పనిలో ఉన్నారు

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు