Sobhita dhulipala: ఆగలేకపోతున్నా.. దానికోసం ఎదురుచూపు.. అక్కినేని కోడలు బోల్డ్ స్టేట్మెంట్..!

Sobhita Dhulipala.. ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ (Sobhita dhulipala) ఏకంగా తన అదృష్టాన్ని బాలీవుడ్లో పరీక్షించుకుంది. అక్కడ వరుస అవకాశాలు తలుపు తట్టడంతో అక్కడే స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది ఈ తెలుగు అమ్మాయి. ఇకపోతే బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అల్లరిస్తున్న శోభిత ధూళిపాల తన అంద చందాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ గ్లామర్ ఫోటోషూట్స్ షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ,, ఇప్పుడు అక్కినేని ఇంటికి కోడలు కాబోతోంది.

Sobhita Dhulipala: Can't wait.. Looking forward to it.. Akkineni's daughter-in-law's bold statement..!
Sobhita Dhulipala: Can’t wait.. Looking forward to it.. Akkineni’s daughter-in-law’s bold statement..!

బాలీవుడ్ స్క్రీన్ పై హాట్ ప్రదర్శన..

ముఖ్యంగా బాలీవుడ్ స్క్రీన్ మీద హాట్ గా , బోల్డ్ గా కనిపించే ఈమె , ఇప్పుడు అక్కినేని కోడలు కావడంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇకపోతే నిన్న మొన్నటి వరకు ఈమె గురించి ఎక్కడ పెద్దగా చర్చ వచ్చేది కాదు. కానీ ఎప్పుడైతే నాగచైతన్య తో నిశ్చితార్థం జరుపుకుందో అప్పటినుంచి ఆమె పాపులారిటీతో పాటు ఫాలోవర్స్ కూడా భారీగా పెరిగిపోయారు. ఈ నేపథ్యంలోనే జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చింది శోభిత.

భర్త సహకారం అంటే ఏదైనా సాధించవచ్చు..

శోభిత మాట్లాడుతూ.. జీవితాన్ని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోకూడదు. ఒక నదీ ప్రవాహంలా సాగిపోవాలంతే. నీ జీవితంలో ఏం చేయాలనుకుంటే అది చేసేయాలి. ముఖ్యంగా మన జీవితం చాలా చిన్నది ప్రతి క్షణం మనం ఆస్వాదించాలి. అంతేకానీ కట్టుబాట్లు పెట్టుకొని, జీవితాన్ని కుదించుకోకూడదు. పెద్దగా లక్ష్యం లేనప్పుడు జీవితంపై కూడా పెద్దగా ఆసక్తి ఉండదు. జీవితంలో కొంతమంది ఆర్థికపరంగా అభద్రత భావానికి లోనవుతారు. ఎవరితోనైనా రిలేషన్ లో ఉంటే ఆ భయం ఇంకా పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి సపోర్టు ఉంటే ఎలాంటి భయాలు ఉండవు. మన పక్కన ఒకరున్నారు అంటే ఎన్నో విషయాలు సాధించడానికి వీలు ఉంటుంది.

- Advertisement -

మాతృత్వాన్ని పొందాలనుకుంటున్న శోభిత..

ఏ మహిళకు అయితే భర్త నుంచి సహకారం అందుతుందో.. ఆ మహిళ గొప్పగా రాణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను కూడా నా జీవితంలో నా భర్త పాత్ర ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాను అంటూ తెలిపింది శోభిత. నా జీవితంలోని కొన్ని విషయాలను నేను నిజాయితీగా పంచుకోవాలని అనుకుంటున్నాను. త్వరలోనే మాతృత్వాన్ని కూడా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. వివాహం జరిగిన తర్వాత తల్లి కావడానికి పెద్దగా రూల్స్ ఏవి నేను పెట్టుకోలేదు. అది ఎప్పుడు అయితే అప్పుడే నేను తీసుకుంటాను అంటూ చెబుతోంది. మాతృత్వపు అనుభూతి గురించి ఊహించుకుంటేనే అది గొప్పగా ఉంటుంది అంటూ తెలిపింది శోభిత. మొత్తానికి అయితే నాగచైతన్య సహకారంతో అన్ని విషయాలలో సక్సెస్ సాధించాలని, అలాగే మాతృత్వాన్ని కూడా పొందాలని కోరుకుంటుంది శోభిత.

శోభిత సినిమాలు..

శోభిత కెరియర్ విషయానికి వస్తే.. గూడాచారి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె, ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళంలో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించిన ఈమె, ప్రస్తుతం మంకీ మాన్ అనే అమెరికన్ ఇంగ్లీష్ సినిమాలో నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు