Sobhita: కోడలిగా శోభిత ఎంట్రీ.. చిక్కుల్లో పడ్డ అక్కినేని ఫ్యామిలీ..!

Sobhita.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్యb(Naga Chaitanya) సహానటి సమంత (Samantha)ను ప్రేమించి పెళ్లి చేసుకొని, నాలుగు సంవత్సరాలకే ఆమె నుండి విడిపోయారు. 2021 లో సమంత, నాగచైతన్య విడిపోగా సమంత కెరీర్ పైన దృష్టి సారిస్తే, నాగచైతన్య మాత్రం ప్రముఖ హీరోయిన్ శోభిత (Sobhita)తో రిలేషన్ లో ఉన్నారు. అప్పటి నుంచే వీరిద్దరు వెకేషన్స్ కి వెళ్తున్నారు. కానీ ఆ ఫోటోలు వైరల్ కాగా ఎన్నో రకాల రూమర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఈ రూమర్స్ ని ఖండించే ప్రయత్నం చేయలేదు ఈ జంట.

Sobhita: Sobhita's entry as daughter-in-law.. Akkineni family in trouble..!
Sobhita: Sobhita’s entry as daughter-in-law.. Akkineni family in trouble..!

అక్కినేని నాగచైతన్యతో శోభిత నిశ్చితార్థం..

అయితే అందరి అంచనాలను నిజం చేస్తూ ఆగస్టు 8వ తేదీన అక్కినేని నాగచైతన్య శోభితతో నిశ్చితార్థం చేసుకున్నారు. అంతే కాదు ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. వీరిద్దరికీ నిశ్చితార్థం చేశామని అధికారికంగా ప్రకటించారు కూడా.. దీంతో నాగచైతన్యకు శోభిత వల్ల కలిసొస్తుందని, అన్నీ ప్లాన్ చేసి డేట్ ను , టైమ్ ను సైతం ఫిక్స్ చేసి వీరిద్దరికి అనుకూలమైన గ్రహాల ప్రకారమే ఎంగేజ్మెంట్ చేశాము.. పెళ్లి తేదీ విషయం పైన కూడా ఇంతే పగడ్బందీగా ప్లాన్ ప్రకారమే అనుకూలమైన తేదీలని చూసేలా ప్లాన్ చేస్తున్నాము అంటూ తెలిపారు నాగార్జున.

అక్కినేని కుటుంబానికి దురదృష్టంగా మారిన శోభిత..

ఇక ఈ విషయం తెలిసిన తరువాత అభిమానులు, నెటిజన్లు.. శోభిత అక్కినేని కుటుంబానికి, అటు నాగచైతన్య కి అదృష్టం కాబోతోంది అంటూ పలు రకాల వార్తలైతే వినిపించారు. కానీ ఇప్పుడు తాజా పరిస్థితిని చూస్తే.. అక్కినేని కుటుంబానికి శోభిత దురదృష్టంగా మారింది అనే విషయాలు తెరపైకి వచ్చాయి. నిశ్చితార్థం జరిగి నెల కూడా కాలేదు అప్పుడే అక్కినేని కుటుంబానికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ (N – Convention) హాల్ కూల్చివేత అక్కినేని కుటుంబ సభ్యులను సతమత పెడుతోంది.

- Advertisement -

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..

తాజాగా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. మాదాపూర్ లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని, ముఖ్యంగా మూడున్నర ఎకరాలు కబ్జా చేసి అక్రమంగా సొంతం చేసుకొని ఈ కన్వెన్షన్ నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. గతంలోనే ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్నారు అంటూ వార్తలు రాగా అందులో నిజం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఏకంగా కూల్చివేసేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండడమే ఈ హైడ్రా ప్రధాన లక్ష్యం. ఇలా అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫిర్యాదు అందినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కూల్చివేత ప్రారంభించింది హైడ్రా. మొత్తానికి అయితే అక్కినేని ఇంటికి కోడలిగా శోభిత ఇంకా అడుగు పెట్టనే లేదు. అప్పుడే ఈ కుటుంబం చిక్కుల్లో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా శోభిత అక్కినేని కుటుంబానికి కలిసి రావట్లేదంటూ శోభిత యాంటీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు