Akkineni Family : అక్కినేని ఫ్యామిలీలో తండ్రిని ఫాలో అవుతున్న కొడుకులు.. అదే ఇది?

Akkineni Family : ఇండస్ట్రీని ఏలుతున్న నాలుగు ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒక్కటి. టాలీవుడ్​లో అక్కినేని ఫ్యామిలీ ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అక్కినేని నాగేశ్వర రావు నుంచి అఖిల్ వరకు మంచి గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే ఈ కుటుంబంలో చేస్తున్న అందరికీ ఈ మధ్య సినిమాలు పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేకపోతున్నాయి.. సినిమాలను పక్కన పెడితే ఈ కుటుంబంలో రెండు పెళ్లిళ్లు కామన్.. సినిమాల పరంగా దూసుకుపోతున్న ఈ ఫ్యామిలీ వైవాహిక జీవితంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గేవుంటుంది. ఈ కుటుంబంలో అందరికీ రెండు పెళ్లిళ్లు కామన్… వీరి పెళ్లిళ్లు గురించి ఒకసారి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం..

Sons following Nagarjuna in the Akkineni family
Sons following Nagarjuna in the Akkineni family

నాగార్జున..

ఈ ఫామిలీ అంటే అందమైన హీరోల కు అడ్డా. నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ వరకు అందరు మన్మధులే.నాగార్జున గారు మంచి హీరో ,ప్రొడ్యూసర్ కూడా.నాగార్జున సినిమాల్లో నటించే రోజుల్లోనే నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గారి కూతురు లక్ష్మి ని పెళ్లి చేసుకున్నారు.వీరికి నాగ చైతన్య పుట్టాక మనస్పర్థలు రావటం తో ఇద్దరు విడిపోయారు.. ఆ తర్వాత అమలను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక అఖిల్ పుట్టాడు. ప్రస్తుతం అతను హీరోగా చేస్తున్నాడు.

నాగచైతన్య..

అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాడు. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను కూడా తండ్రిలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏం మాయ చేశావ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంతతో ప్రేమలో పడ్డాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్లు కలిసి కాపురం చేశాక మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు. నిన్న హీరోయిన్ శోబితా దూలిపాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

- Advertisement -

అఖిల్..

తండ్రి, అన్న అడుగులోనే తమ్ముడు కూడా నడుస్తున్నాడు. అఖిల్ సినిమాల పరంగా పెద్దగా ఫేమ్ ను అందుకోలేక పోతున్నాడు. అయితే గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతో పెళ్లికి సిద్ధం అయ్యాడు. ఎంగేజ్మెంట్ అయ్యాక ఏమైందో తెలియదు కానీ అది క్యాన్సిల్ అయ్యింది. రెండోసారి పెళ్లికి సిద్ధంగా లేడని తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే తండ్రికి తగ్గ కొడుకులే. అందరికీ రెండు పెళ్లిళ్లు కామన్ అయ్యాయి. ఇకపోతే వీరి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అందరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్కినేని హీరో నాగ చైతన్య రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు ఎక్కడ విన్నా అక్కినేని ఫ్యామిలీ గురించే చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వీరు సినిమాలను చేస్తున్న కూడా అవి పెద్దగా హిట్ టాక్ ను అందుకోక పోవడం, రెండు పెళ్లిళ్లు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు