Vijay – Rashmika: త్వరలో విజయ్ దేవరకొండ – రష్మిక ల ఎంగేజ్మెంట్.. క్లారిటీ ఇదే..!

Vijay – Rashmika: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి కామన్.. ముఖ్యంగా ఎఫైర్స్ గురించి అయితే నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది .ఈ క్రమంలోనే ఇప్పుడు విజయ్ దేవరకొండ , రష్మిక జంట గురించి చాలా రోజుల నుంచి ఎఫైర్ వార్తలు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి మొదట గీతగోవిందం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. అప్పటినుంచి ఈ జంట ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు. కానీ వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని నెటిజన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

అందుకు తగ్గట్టు కారణాలు కూడా లేకపోలేదు. ప్రతిరోజు ఏదో ఒకచోట వీళ్ళిద్దరూ ఒక్కటిగా కనిపిస్తూ ఉండడం పండుగల సమయంలో రష్మిక.. విజయ్ ఇంట్లో ఉండడం.. ఇద్దరు కలిసి వెకేషన్ కి వెళ్లడం ఇలా ఎన్నో సంఘటనలు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని రుజువు చేశాయి. అయితే ఎప్పుడూ కూడా ఈ జంట తామిద్దరం రిలేషన్ లో ఉన్నట్టు బయటపడలేదు ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా వార్తలు రావడానికి కారణం ఒకరకంగా వేణు స్వామి అని చెప్పాలి. ఎందుకంటే రష్మిక.. వేణు స్వామితో కొన్ని సార్లు పూజలు చేయించుకున్న విషయం అందరికీ తెలిసిందే.

అంతేకాదు తను రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత.. వివాహం చేసుకుంటే కెరీర్ నాశనం అవుతుందని వేణు స్వామి చెప్పడంతో రక్షిత్ తో వివాహాన్ని కూడా రద్దు చేసుకుంది. అంతలా ఆయన మాటలు నమ్మే ఈమె.. విజయ్ దేవరకొండ నివాహం చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతుందని వేణు స్వామి చెప్పినా సరే ఈసారి మాత్రం వినడం లేదని.. తనతోనే గొడవ పెట్టుకుందని.. వేణు స్వామి స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు ఈ వార్తలు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. ఇక వేణు స్వామి చెప్పినా వినకుండా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

- Advertisement -

అయితే ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీం స్పందించింది.. ఇది ఒక ఫేక్ వార్త అని.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వెకేషన్ లో ఉండగా.. రష్మిక తన సినిమాలలో బిజీగా ఉందని తెలిపారు. అంతేకాదు ఇలాంటి వార్తలను అభిమానులు అస్సలు నమ్మవద్దు అని కూడా తెలిపారు. మరి ఇలాంటి వార్తలు ఆగాలంటే .. వీరిద్దరిలో ఎవరో ఒకరి వివాహం చేసుకుంటే తప్ప పుకార్లు ఆగవు అని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు