Vijay Devarakonda: విజయ్ సరసన నటించనున్న తోపు హీరోయిన్‌..?

Vijay Devarakonda: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి తెలియని వారెవరు ఉండరు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా విజయ్ దేవరకొండ ఉండడం విశేషం. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరిలో విజయ్ దేవరకొండ టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. తన సినీ కెరీర్ లో సాధించిన విజయాలు తక్కువే అయినప్పటికీ స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ దక్కించుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ.

గీత గోవిందం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు మాత్రమే హీరో విజయ్ దేవరకొండ కు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇక హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా నటించిన మూడు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ కొన్ని స్ట్రైయిట్ తెలుగు సినిమాలతో పాటు మరికొన్ని తన తెలుగు హిట్స్ హిందీ రీమేక్స్ కూడా వద్దన్నాడని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ రీమేక్స్ లో అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా హీరో విజయ్ దేవరకొండ ఉన్న విషయం విధితమే. ఇక హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్‌ లో ఒకటి SVC59 సినిమా. రాజావారు రాణి గారు ఫెమ్ రవి కిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన మోషన్ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

- Advertisement -

కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. కాగా….ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఏంటంటే….ఈ చిత్రంలో శ్రీలీల ఓ స్పెషల్‌ రోల్ చేస్తోందట. సెకండ్‌ ఆఫ్‌ లో ఈ బ్యూటీ కనువిందు చేయనుందట. అటు ఈ సినిమాలో సాయి పల్లవి మెయిన్‌ హీరోయిన్‌ అని వార్తలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు