Sreeleela: బాలీవుడ్ ఛాన్స్ మిస్ చేసుకున్న యంగ్ బ్యూటీ

Sreeleela: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో శ్రీ లీల ఒకరు. మామూలుగా మొదటి సినిమా ఫీల్ అయితే చాలామందికి అవకాశాలు రావడం అరుదుగా జరుగుతుంది. ఒక సినిమా సక్సెస్ అయితేనే ఇక్కడ వరుస అవకాశాలు వస్తాయి. కానీ శ్రీ లీల విషయంలో అలా జరగలేదు. పెళ్లి సందడి సినిమా డిజాస్టర్ టాక్ సాధించుకున్న కూడా, శ్రీ లీల కు వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే శ్రీ లీలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కెరియర్లో ముందుకు వచ్చింది. చాలామంది స్టార్ హీరోలు సరసన కూడా నటించే అవకాశాన్ని కూడా సాధించుకుంది.

ఇకపోతే శ్రీ లీల రీసెంట్ గా ఒక బాలీవుడ్ ఛాన్స్ ను మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వరుణ్ దావన్ హీరోగా తన తండ్రి దర్శకుడుగా చేయబోయే ఒక సినిమాలో శ్రీ లీల అవకాశాన్ని మిస్ చేసుకుందట. శ్రీ లీల మిస్ చేసుకున్న ఆ అవకాశాన్ని మృణాల్ ఠాకూర్ అందుకుంది.  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం అనే సినిమాలో శ్రీ లీల కనిపించింది. అయితే ఈ సినిమాతో శ్రీ లీల మంచి పేరు సాధించుకుంది. కేవలం మహేష్ బాబు తో మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ సరసన కూడా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో కనిపించనుంది.

Sreeleela

- Advertisement -

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా భగత్ సింగ్. ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఒక హిట్ సినిమా చూసి చాలా రోజులు అయింది అనుకునే తరుణంలో గబ్బర్ సింగ్ సినిమాతో ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ వచ్చేలా చేసాడు హరీష్ శంకర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇప్పుడు మళ్లీ మీరు కాంబినేషన్లో సినిమా వస్తుందేనంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.

అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి సంబంధించి చాలా తక్కువ రోజులు డేట్స్ ఇచ్చినా కూడా అద్భుతమైన కంటెంట్ రాబట్టగలిగాడు హరీష్. ఈ సినిమాకి సంబంధించి ఇదివరకే రెండు టీజర్లను రిలీజ్ చేశాడు. ఒక టీజర్ లో పవన్ కళ్యాణ్ కి బీభత్సమైన ఎలివేషన్ తో పాటు, మరో టీజర్లు శ్రీ లీలను కూడా చూపించాడు హరీష్. ఏదేమైనా పవన్ కళ్యాణ్ లైనప్ లో చాలామంది ఎదురుచూస్తున్న సినిమాలలో ఇది కూడా ఒకటి ఉంది అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు