Sreelela : స్టార్‌ హీరోతో పెళ్లి ఫిక్స్ చేసుకున్న శ్రీలీల… ఈ సడన్ డిసిషన్ ఎందుకు పాప..

Sreelela : టాలీవుడ్ యంగ్ సెన్షేనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ఎంత చెప్పిన తక్కువే.. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను అందుకుంది.. ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసేందుకు రెడీ అవుతుంది. ఇటీవల నితిన్ సినిమాతో పాటు రవితేజ తో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.. ఆ సినిమాలను అనౌన్స్ చేసిందో లేదో ఇప్పుడు ఓ స్టార్ హీరోతో పెళ్లి పీటలు ఎక్కబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

శ్రీలీల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలను చేసింది.. హిట్ సినిమాలు తక్కువే.. ఎక్కువగా ఫ్లాప్ సినిమాలే పలకరించాయి.. పెళ్లి సందడి సినిమా తర్వాత రవితేజ ధమాకా సినిమా భారీ హిట్ టాక్ ను అందించింది. ఆ తర్వాత పెద్దగా హిట్ సినిమాలు లేకపోవడంతో దాదాపు ఏడాది పాటు గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ రవితేజ సినిమాతోనే అదృష్టాన్ని పరీక్షంచుకోబోతుంది.. ఇటీవలే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.. అలాగే నితిన్ సినిమాలో నటిస్తుంది..

sreeleela fans are going to marry the star hero are shocked
sreeleela fans are going to marry the star hero are shocked

ఇది కాక బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆ సినిమాల అనౌన్స్మెంట్ రాబోతుంది. ఇలా ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో బిజీ అవుతున్న శ్రీలీల ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందని వార్తలు గుప్పుమన్నాయి. అదికూడా ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతుందని టాక్.. ఈ ఏడాదిలోనే పెళ్లి ఉంటుందని సమాచారం.. ఈ వార్తలో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.. మరి ఆ హీరో ఎవరు? ఇంతకీ ఈ వార్త నిజమేనా ? అనే ప్రశ్నలు ఆమె అభిమానులకు వస్తున్నాయి. ఏదేమైన ఈ వార్త విన్న ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ సడన్ డిసిషన్ ఎందుకు పాప అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.. దీనిపై శ్రీలీల క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు