Sreeleela: “స్కంద” లో మరోసారి మాస్ బీట్ తో అదరగొట్టనుందా?

Sreeleela maas dance in skanda movie:

టాలీవుడ్ లో డాన్స్ బాగా చేసే హీరోయిన్లలో ముందుగా వినబడే పేర్లు సాయి పల్లవి, తమన్నా, శృతి హాసన్.. ఇక రీసెంట్ గా ఈ లిస్ట్ లోకి శ్రీ లీల కూడా చేరిపోయిందన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎక్కువ సినిమాల్లో శ్రీ లీల నటించకపోయినా, చేసిన అన్ని సినిమాల్లో అయితే తన డాన్స్ టాలెంట్ ఏంటో చూపించింది. ఇక ప్రస్తుతం శ్రీలీల అరడజను కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. అదికూడా పెద్ద సినిమాలే కావడం విశేషం.

అందులో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న “స్కంద” కూడా ఒకటి. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిపోగా, తాజాగా పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. లేటెస్ట్ గా స్కంద సాంగ్ గురించి ఒక సాలిడ్ రూమర్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో హీరో రామ్ తో కలిసి ఒక మాస్ బీట్ డాన్స్ ఉంటుందని, ఆ సాంగ్ లో సింగిల్ టేక్ లో ఆరనిమిషానికి పైగా ఒక స్టెప్ ఉంటుందని సమాచారం. ఆ స్టెప్ లో రామ్ తో కలిసి శ్రీ లీల ఓ రేంజ్ లో డాన్స్ చేసిందట.

ఇంతకు ముందు వచ్చిన ధమాకా సినిమాలో శ్రీ లీల ఏ రేంజ్ లో డాన్స్ చేసిందో తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత “గుంటూరు కారం” సెట్స్ లో అడుగుపెట్టనుంది. అయితే శ్రీ లీల చేస్తున్న సినిమాల్లో చాలా వరకు గ్లామర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలే వస్తున్నాయి. ఇక “స్కంద” సినిమా టీజర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ రాబట్టుకోగా త్వరలో రిలీజ్ అవుతున్న ఫస్ట్ లిరికల్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు