Sreeleela: కన్ఫ్యూజన్ లో శ్రీ లీల.. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉన్నట్టా? లేనట్టా..?

కన్నడ యంగ్ బ్యూటీ శ్రీలీల తెలుగులో ధమాకా సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది.వరుసగా సినిమాలు చేస్తూ.. మరింత పాపులారిటీ సొంతం చేసుకోవడమే కాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకే ఏడాది పదికి పైగా చిత్రాలకు సంతకం చేసిన హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. ఒక టైంలో ఏ సినిమా పోస్టర్ చూసినా ఈమె ఫోటోనే కనిపించేది. మిడ్ రేంజ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు వచ్చిన ప్రతి ఆఫర్ కి కూడా ఓకే చెప్పింది. రీసెంట్గా శ్రీ లీలా నటించిన గుంటూరు కారం సినిమా కూడా కమర్షియల్ గా మంచి వసూలు రాబట్టింది.. అయితే మహేష్ బాబుకి ఉన్న స్టార్డం క్రేజ్ లెక్కలోకి తీసుకుంటే.. ఇది కేవలం యావరేజ్ అన్న విషయం ఒప్పుకోవాల్సిందే.. అలాగని ఈ సినిమాని బ్లాక్ బస్టర్ మూవీ కూడా అనలేము..

దీనికి ముందు శ్రీ లీల నితిన్ తో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వైష్ణవ తేజ్ తో ఆదికేశవ , రామ్ పోతినేనితో స్కంద మూవీ లలో హీరోయిన్గా చేసింది. కానీ మూడు చిత్రాలు కూడా భారీ డిజాస్టర్ గా నిలిచాయి.. ఇప్పటివరకు శ్రీ లీలా ఖాతాలో భగవంత్ కేసరి సినిమా సక్సెస్ మాత్రమే నిలిచింది. అయితే ఈ మూవీ క్రెడిట్ మొత్తం బాలయ్య ఖాతాలోకి వెళ్లిందని చెప్పాలి. ఇలా వరుస ఫ్లాప్ లు వెంటాడుతూ ఉండడంతో.. శ్రీ లీల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మరింత శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం.. అందుకే ఆమె కొత్త కమిట్మెంట్ ఇవ్వలేదని సమాచారం.. మరోపక్క పవన్ కళ్యాణ్ తో శ్రీ లీల నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఎప్పుడు డేట్ లు అవసరం అవుతాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.. ప్రస్తుతం ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడే షూటింగ్ కొనసాగించాలని దర్శక నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు.. అందుకే అప్పటివరకు శ్రీలీల ఓపికగా ఎదురు చూడక తప్పదు..

ఒకవేళ ఇతర హీరోల సినిమాలలో అవకాశాలు వస్తే పవన్ కళ్యాణ్ మూవీని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ మూవీ వదులుకుంటే ఆమె కెరీర్ కి రిస్క్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే ఏం చేయాలో తెలియక ప్రస్తుతం ఈమె కన్ఫ్యూజన్లో పడినట్లు తెలుస్తోంది.. ఇక ప్రస్తుతం వెంకి కుడుముల, నితిన్ కాంబోలో వస్తున్న రాబిన్ హుడ్ మూవీ కోసం ఈమెను అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి హీరోయిన్ లేకుండా షూటింగ్ కానిస్తున్నప్పటికీ మరి కొన్ని రోజుల్లో హీరోయిన్ ఎవరన్న విషయం కూడా రివీల్ చేస్తారు.. ఇక ఈమె చరణ్ బుచ్చిబాబు మూవీకి కూడా జాన్వీ ఫిక్స్ అయింది కాబట్టి మరొకవైపు ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలలో అవకాశాలు రావడం చాలా తక్కువ. ఈ నేపథ్యంలోనే ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అన్న అయోమయం కూడా నెలకొంది.. మొత్తానికైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి శ్రీలీల నెక్స్ట్ ఏం చేయబోతోంది అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు