Sreeleela: సెట్స్‌లోకి “పవర్” ఫుల్ ఎంట్రీ..

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల తెలుగులో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది. పెళ్ళిసందడి చిత్రం ద్వారా తెలుగులో అడుగుపెట్టిన ఈ కన్నడ ముద్దుగుమ్మ మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని దక్కించుకుంది. అంతే కాదు ఆ సినిమాలో చాలా గ్లామర్ గా కనిపించి వరుసగా మూవీ ఛాన్సులు కొట్టేసింది. రీసెంట్ గా రవితేజ ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో శ్రీ లీల ను గోల్డెన్ లెగ్ అనేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీలీల అరడజను కు పైగా తెలుగు సినిమాల్లో నటిస్తుంది. మహేష్ బాబు తో SSMB28 లోను, నితిన్ తో ఓ సినిమా, NBK 108 లో కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. ఇప్పుడు మరో టాప్ హీరో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందంటూ ఇండస్ట్రీ లో వార్తలు వినబడుతున్నాయి. అది వేరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీ లీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందంటూ వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ఇర్రం మంజిల్ ఏరియా లో జరుగుతుంది. అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ రోజు నుంచి శ్రీ లీల ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటుందంటూ సోషల్ మీడియా లో వార్తలు వినబడుతున్నాయి. ఈ వార్తలు నిజమేనని ఈ రోజు చిత్ర యూనిట్ నుంచి సమాచారం అందింది. ఇది శ్రీ లీల కు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు