Hero Sree Vishnu : అప్పుడు ట్రాన్స్‌జెండర్‌తో రొమాన్స్.. ఇప్పుడు ఏకంగా జెండర్ మార్చేశాడు

Hero Sree Vishnu : యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి, ఆయన సినిమాల గురించి, ఎంచుకునే స్టోరీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీ విష్ణు నటించిన ఒక్క సినిమా కూడా ఆడియన్స్ ను నిరాశ పరచదు అని చెప్పొచ్చు. ఈ యంగ్ హీరో ఎంచుకునే స్టోరీలు అలాంటివి మరి. అయితే శ్రీ విష్ణు ఇప్పుడు ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించబోతున్నాడని ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు చూద్ధాం…

శ్రీ విష్ణు డిఫరెంట్ స్టోరీలను ఎంచుకోవడం మాత్రమే కాదు, డిఫరెంట్ పాత్రలను కూడా ఎంచుకుంటాడు. ప్రస్తుతం శ్రీ విష్ణు స్వాగ్ అనే మూవీ చేస్తున్నాడు. దీనికి హసితి గోలీ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే రాజ రాజ చోళ అనే మూవీ వచ్చింది. ఇప్పుడు స్వాగ్ కోసం రెండోసారి వీళ్లు జతకడుతున్నారు.

Sree Vishnu upcoming movie Swag
Sree Vishnu upcoming movie Swag

అయితే ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ అంశం తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు 14 గెటప్స్‌లో కనిపించబోతున్నాడట. అందులో ఓ పాత్ర ట్రాన్స్ జెండర్ అని తెలుస్తుంది. దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలిదు కానీ, ఇప్పుడు ఇండస్ట్రీలో హట్ టాపిక్ గా మారిపోయింది.

- Advertisement -

శ్రీ విష్ణు లాస్ట్ మూవీ ఓం భీమ్ బుష్‌లో ఓ సీన్‌లో ట్రాన్స్ జెండర్ తో రొమాన్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రాబోయే స్వాగ్ సినిమాలో ఏకంగా ట్రాన్స్ జెండర్ పాత్రే చేయబోతున్నాడు శ్రీ విష్ణు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు