Aadi Keshava: శ్రీలీల క్రేజీ డెసిషన్.. తొలి లిప్ లాక్ ఆయనకే ఇస్తుందట..!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ చేసింది మూడు, నాలుగు సినిమాలే అయినా.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈమె నటించిన సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర నిర్మాతలు ఆమెకే ప్రియారిటీ ఇస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది శ్రీలీల. టాలీవుడ్ లక్కీ చార్మ్ గా ఈ భామను అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరికీ శ్రీలీలనే ఫస్ట్ ఛాయిస్ అవుతోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. వాటిలో చాలావరకు పెద్ద సినిమాలే. తాజాగా ఈమె బాలయ్య కూతురిగా నటించిన భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించిన ఆదికేశవ చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో శ్రీలీల తన డాన్స్ తో అదరగొట్టేసిందని చెబుతున్నారు. అయితే శ్రీలీల ఇంతవరకు నటించిన సినిమాలలో ఎక్కడ హద్దులు దాటి నటించలేదు.

తనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకుని ముందుకు సాగుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్ లో లిప్ లాక్ సీన్ చేయవలసి వస్తే ఎవరితో చేస్తారు..? అనే ప్రశ్న ఎదురయింది. దీనికి శ్రీలీల సమాధానమిస్తూ.. తాను ఏ హీరోతో లిప్ లాక్ సీన్లు చేయను అని తేల్చి చెప్పింది. ఒకవేళ అలా చేయాల్సి వస్తే తన భర్తకే తొలి కిస్ ఇస్తానని చెప్పుకొచ్చింది. మొత్తంగా తాను లిప్ లాక్ సీన్లు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మరి భవిష్యత్తులో కథ డిమాండ్ చేస్తే ఆమె మనసు మార్చుకుంటుందేమో వేచి చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movies news, cinema news in telugu, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News and gossip from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు