Dhamaka: ఒక్క లిప్ కిస్ చేస్తే అన్ని కోట్లా..? శ్రీలీల డిమాండ్ మామూలుగా లేదుగా..!

Dhamaka:

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరుడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. శ్రీలీల ప్రస్తుతం కుర్రహీరోలు అందరికీ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోతుంది. ప్రస్తుతం ఆమె వయసు 20 సంవత్సరాలే అయినా కూడా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. మొదట కన్నడలో రెండు మూడు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో శ్రీకాంత్ కొడుకు నటించిన పెళ్లి సందD సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.

ఇక మొదటి సినిమాలోనే తన అందం, డాన్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అనంతరం గతేడాది రవితేజతో కలిసి ధమాకా సినిమాతో ప్రేక్షకులను పలకరించి సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈమె చేసింది రెండు సినిమాలే అయినా ఇప్పటికే రెమ్యూనరేషన్ పెంచేసిందని ఎన్నోసార్లు వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తుందట శ్రీలీల.

రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి ఓ రెమ్యూనరేషన్, ట్రెడిషనల్ రోల్స్ కి ఓ రెమ్యూనరేషన్, బోల్డ్ సీన్స్ కి మరో రెమ్యూనరేషన్.. ఇలా సపరేట్ రెమ్యూనరేషన్ లు డిమాండ్ చేస్తుందట. ప్రస్తుతం ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ సైతం సిద్ధపడుతున్నారట. ఇప్పటికే శ్రీలీల ఒక్కొక్క సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని.. ఇకనుండి చేయబోయే సినిమాలకు మాత్రం ఏకంగా ఏడు కోట్లు డిమాండ్ చేస్తుందట.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings,

and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు