SSMB29 : జక్కన్న – మహేష్ సినిమాకు అన్ని యేళ్లా? అభిమానులకు ఇక రీ రిలీజ్ లే గతి..!

SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు “గుంటూరు కారం” సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. మహేష్ అభిమానులతో పాటు, కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఉండే మహేష్ బాబు బాలీవుడ్ లో ఎన్ని భారీ ఆఫర్లు వచ్చినా తిరస్కరించారు. కానీ ఇప్పుడు జక్కన్నతో పాన్ ఇండియా కాకుండా ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమా చేయబోతున్నాడు. కనీవినీ ఎరగని రేంజ్ లో సినిమా ఉండబోతుందని నెట్టింట అంటున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా స్టార్ట్ చేయకపోయినా, రాజమౌళి మాత్రం గత ఏడెనిమిది నెలల నుండి సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టగా, మహేష్ ఈ సినిమా కోసం తొలిసారి లాంగ్ హెయిర్ ని పెంచి, గడ్డం కూడా పెంచుతున్నాడు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఓ వార్త ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది.

SSMB29 movie to release in theaters in 2028?

మహేష్ జక్కన్న సినిమాకు ఇన్నేళ్లా?

ఇక తాజాగా మహేష్ బాబు SSMB29 కి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇంకా అఫిషియల్ గా ప్రారంభం కానీ ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతుండగా, ఈ సినిమా పూర్తయి రిలీజ్ అవ్వాలంటే ఏకంగా 2028 దాకా వెయిట్ చేయాల్సి వస్తుందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. అంటే ఏకంగా నాలుగేళ్ళన్నమాట. ఇన్నేళ్లు రాజమౌళి ఏ సినిమా కూడా తీయలేదని చెప్పాలి. RRR కూడా లాక్ డౌన్ వల్ల కాస్త లేట్ అయింది అంతే. ఇక మహేష్ బాబు (Mahesh babu) కూడా రెండున్నరేళ్లకు మించి ఎప్పుడూ మళ్ళీ అంత టైం తీసుకోలేదు. దీంతో మహేష్ బాబు ఫాన్స్ ని ఈ వార్తలు కలవరపెడుతున్నాయి.

- Advertisement -

అంత వరకు రీ రిలీజ్ లే గతి?

ఇక SSMB29 గురించి వస్తున్న ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు గాని, నిజమైతే పెద్ద దెబ్బే అవుతుంది. ట్రేడ్ విశ్లేషకులు కూడా మరీ ఇంత ఆలస్యం జక్కన్న (SS Rajamouli) చేయడని అంటున్నారు. ఏది ఏమైనా మహేష్ సినిమా రావాలంటే మరో రెండేళ్లయినా పడుతుందిగా. అంత వరకు మహేష్ బాబు నటించిన సినిమాలు రీ రిలీజ్ అవుతుంటాయి. ఆ రీ రిలీజ్ సినిమాలు చూసే ఫ్యాన్స్ సంతృప్తి పడాలన్నట్టు తెలుస్తుంది. ఇక మహేష్ బాబు SSMB29 ని శ్రీ దుర్గ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో K.L.నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. దాదాపు 500 కోట్లకి పైగా బడ్జెట్ అవుతుందని సమాచారం. ఇక ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల వివరాలు, టెక్నిషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు