Tollywood: విక్టరీ వెంకటేష్ చెంప చెల్లుమనిపించిన స్టార్ డైరెక్టర్..!

Tollywood:

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం చేయనక్కర్లేదు. ఆరుపదుల వయసులో కూడా సక్సెస్ఫుల్ గా హీరోగా కొనసాగుతున్నాడు వెంకటేష్. కామెడీ, యాక్షన్ ఇలా ఏ జానర్ లో సినిమాలైనా కూడా వెంకటేష్ ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకటేష్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీ, యూత్ ఇలా అందరూ ఆడియన్స్ నీ టార్గెట్ చేస్తూ ఆయన చేసిన సినిమాలన్నీ సెన్సేషన్ సృష్టించాయి.

ఇదిలా ఉంటే.. విక్టరీ వెంకటేష్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంత పెద్ద హీరో అయిన వెంకటేష్ చెంప చెల్లుమనిపించాడట ఓ స్టార్ డైరెక్టర్. అందరూ చూస్తుండగానే షూటింగ్ స్పాట్ లోనే కొట్టాడట. మరి వెంకటేష్ ని కొట్టిన ఆ డైరెక్టర్ ఎవరు..? అసలు చెంపపై కొట్టేంత తప్పు వెంకటేష్ ఏం చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. విక్టరీ వెంకటేష్ హీరోగా దివంగత హీరోయిన్ దివ్యభారతి హీరోయిన్ గా చిత్రం బొబ్బిలి రాజా. 1990లో వచ్చిన ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూసే ఉంటారు.

ఈ సినిమా షూటింగ్ ని దాదాపు చాలా వరకు అడవిలోనే చిత్రీకరించారు దర్శకుడు బి.గోపాల్. అయితే అదే సమయంలో వెంకటేష్ ముఖంపై ఓ విషపురుగు పడిందట. ఆ పురుగును చూసిన దర్శకుడు గోపాల్ వెంటనే వెంకటేష్ చెంప చెల్లుమనిపించాడట. ఈ విషయం తెలియక అందరూ వెంకటేష్ ని అలా ఎందుకు కొట్టారో అని ఆశ్చర్యపోయారట. దీంతో గోపాల్ “వెంకటేష్ ని ముఖంపై విష పురుగు ఉంది. అందుకే కొట్టాను. అది కరిస్తే చాలా ప్రమాదం” అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారట. అలా ఆరోజు వెంకటేష్ పెద్దగండం నుంచి బయటపడ్డట్లు అయిందని మూవీ యూనిట్ అందరూ అనుకున్నారట.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు