Global Star: అఖిల్ నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ గా స్టార్ హీరో..?

అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్ ఆరంభించిన నాటి నుండి బ్లాక్ బస్టర్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పర్వాలేదు అనిపించింది కానీ, బ్లాక్ బస్టర్ అయితే ఇవ్వలేకపోయింది. ఇటీవల ఎన్నో అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో అఖిల్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న ఆసక్తి నెలకొంది అభిమానుల్లో. ఈ క్రమంలో అఖిల్ నెక్స్ట్ సినిమాపై ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ‘వీ మెగా పిక్చర్స్’ పేరుతో  ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయనున్నారని, ఆ బ్యానర్లో యువ హీరోలను, దర్శకులను ప్రోత్సహించాలని నిర్ణయించారని సమాచారం అందుతోంది.

ఇప్పటికే రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కొత్త బ్యానర్లో పాన్ ఇండియా సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ బ్యానర్ పై అఖిల్ సినిమా విషయంలో అధికారిక ప్రకటన లేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం గట్టిగా టాక్ వినిపిస్తోంది. అఖిల్ నెక్స్ట్ సినిమా విషయంలో ధీర అన్న టైటిల్ ప్రచారంలో ఉండగా, ఈ అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. అంతే కాకుండా రామ్ చరణ్, లోకేష్ కానగరాజ్ కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా ఈ కొత్త బ్యానర్ పైనే ఉండబోతోందని కూడా టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్, ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తైన తర్వాత వీ మెగా పిక్చర్స్ బ్యానర్ పై కన్నడ దర్శకుడు నర్తన్ తో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అఖిల్ నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ కొత్త బ్యానర్ ఫై ఉండనుందన్న విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు