The Goat : రిజల్ట్ ముందుగానే ఊహించారా? అందుకే ఇన్ని క్యామియోలా!

The GOAT : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటించిన “ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం” సినిమా సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ (Thalapathy Vijay) నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై దళపతి అభిమానుల్లో, ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడగా, యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. గొట్ సినిమా మొత్తం పరమ రొటీన్ స్క్రీన్ ప్లే తో అభిమానులకు సైతం విసుగు పుట్టించేలా వెంకట్ ప్రభు (Venkat prabhu) తెరకెక్కించాడని, ఇది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం కాదు, ‘వరెస్ట్ అఫ్ అల్ టైం’ అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.

Star heroes cameo roles in Thalapathy Vijay's movie The Goat

సినిమాలో ఊహించని భారీ క్యామియోస్..

ఇక గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం (Greatest of all time) సినిమాలో భారీ తారాగణం కీలక పాత్రల్లో నటించగా, ఊహించని క్యామియో రోల్స్ సినిమాలో ఉండడం విశేషం. చాలా మందికి సీనియర్ స్టార్ విజయ్ కాంత్ (Vijay kanth) క్యామియో మాత్రమే ఉందని తెలుసు. కానీ సినిమా చూసాక అందులో ఊహించని స్టార్లు కనిపించారు. చనిపోయిన విజయ్ కాంత్ ని AI టెక్నాలజీ వాడి మళ్ళీ తెరపై ఆవిష్కరించగా, స్టార్ హీరోయిన్ త్రిష (trisha) సాంగ్ లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చింది. అలాగే ఓ సీన్ లో శివకార్తికేయన్ (Shiva karthikeyan) కూడా స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చాడు. అన్నిటికి మించి ఎమ్మెస్ ధోని (MS Dhoni) ని బలవంతంగా ఓ సీన్ లో ఇన్వాల్వ్ చేసారు. అలాగే గోట్ లో టిజి రాజేంద్రన్, హీరోయిన్ కనిహ, కోమల్ శర్మ గెస్ట్ గా నటించారు. వీళ్ళతో పాటు కీలక పాత్రల్లో ప్రభుదేవా, జయరాం, ప్రశాంత్, వైభవ్ లాంటి వారు కీలక పాత్రల్లో నటించారు.

- Advertisement -

రిజల్ట్ ఊహించే ఈ క్యామియోస్ పెట్టాడా?

అయితే స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చిన వాళ్ళ పాత్రలు కూడా అప్పటికప్పుడు సంతోషానిచ్చి, ఆ తర్వాత అసలు ఈ క్యామియోస్ అవసరమా అనిపించాయి. నిజానికి సినిమా షూటింగ్ ఫినిషింగ్ లో ఉండగానే సినిమా రిజల్ట్ గురించి అర్థమై పోయి, కాస్తయినా గట్టెక్కించాలని మేకర్స్ ఈ క్యామియోస్ ప్లాన్ చేసారని టాక్ నడుస్తుంది. సినిమా టాక్ ని గమనిస్తే అలాగే ఉంది. చూసిన వాళ్ళందరూ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు తప్ప, సినిమా కంటెంట్ గురించి అస్సలు మాట్లాడడం లేదు. ఏది ఏమైనా గోట్ సినిమాతో విజయ్ ప్లాప్ సినిమా అందుకోక తప్పట్లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు