Star Singer: ఒక్క పాటకు రూ.3 కోట్లు..వీరి డిమాండ్ మాములుగా లేదుగా..?

Star Singer.. సినీ పరిశ్రమలో నటీనటులతో పాటుగా సంగీత దర్శకులకు, గాయకులకు కూడా అత్యధికంగానే రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒక సినిమా విజయం సాధించిందంటే నటీనటులు , కథ ఒక్కటే బాగుంటే సరిపోదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు పాటలు కూడా బాగుండాలి. ఒక్కొక్కసారి కథ బాగా లేకపోయినా పాటల పరంగా కూడా సినిమాలు విజయవంతమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే సింగర్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఒక్కో సింగర్ కి లక్షల రూపాయల పారితోషకం ఇస్తూ నటీనటులతో సమానంగా పారితోషకం అందిస్తూ ఉంటారు మేకర్స్. ఇక్కడ కొంతమంది లక్షల్లో తీసుకుంటే, మరికొంతమంది కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక్కడ ఒక సింగర్ మాత్రం ఏకంగా ఒక్కో పాటకు రూ .3కోట్ల పారితోషికం తీసుకుంటూ రికార్డు సృష్టించారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..

Star Singer: Rs. 3 crores per song.. Their demand is not normal..?
Star Singer: Rs. 3 crores per song.. Their demand is not normal..?

లతా మంగేష్కర్ కి కూడా తక్కువే..

లతా మంగేష్కర్ (Latha Mangeshkar) , మహమ్మద్ రఫీ (Mahammad Rafi)వంటి దిగ్గజ గాయకులు కూడా 1950వ సంవత్సరంలో చాలా తక్కువ రెమ్యూనరేషన్ కి పాడేవారట. అయితే ఆ తర్వాత కాలం మారుతున్న కొద్దీ వీరు డిమాండ్ చేయడం మొదలుపెట్టడం తో సింగర్స్ కి కూడా ప్రస్తుతం రెమ్యూనరేషన్ భారీగానే పెరిగిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం దేశంలోనే చాలామంది గాయకులు లక్షల్లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

శ్రేయ ఘోషల్ వెనక్కి నెట్టి..

కొంతమంది ఒక్కో పాటకు 20 లక్షల రూపాయల వరకు తీసుకుంటూ ఉండగా.. భారతీయ భాషలలో అగ్రగామిగా పేరుపొందిన శ్రేయ ఘోషల్ ఒక్కోపాటకు సుమారుగా 30 లక్షల రూపాయల వరకు తీసుకుంటోందట. శ్రేయ ఘోషల్ (Shreya Ghoshal)హిందీలోనే కాదు తమిళ్ , తెలుగు వంటి భాషలలో కూడా మంచి పేరు సంపాదించింది. వాస్తవానికి శ్రేయ ఘోషల్ మాత్రమే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే గాయని అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అది పొరపాటే.. శ్రేయ ఘోషల్ కంటే ఇండియాలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే ఒక గాయకుడు ఉన్నారు. అది కూడా ఒక్కో పాటకు 3 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.

- Advertisement -

ఒక్క పాటకు రూ .3కోట్లు..

ఆయన ఎవరో కాదు ఏఆర్ రెహమాన్(AR Rahman).. ఏఆర్ రెహమాన్ పాటలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి భారీ క్రేజ్ ఉందని చెప్పవచ్చు. తన పాటలతోనే ఎంతోమందిని మైమరిపించగలిగిన సత్తా కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఏదైనా ఒక సినిమాకి సంగీతాన్ని అందించారంటే రూ.9 నుంచి 10 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నారట ఏఆర్ రెహమాన్. ఇలా ఇండియన్ సినీ పరిశ్రమలోనే సంగీత రంగంలో కూడా ఇప్పటికే ఏడు జాతీయ అవార్డులను కూడా అందుకున్న ఏకైక గాయకుడిగా పేరు సంపాదించారు ఏఆర్ రెహమాన్.

స్టార్ సింగర్ గా మారిన ఏఆర్ రెహమాన్..

ఏఆర్ రెహమాన్ పాటలు ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు విన్నా అభిమానులకు వినాలనిపించే అంతగా ఉంటాయి. అందుకే ఏఆర్ రెహమాన్ డేట్ల కోసం చాలామంది దర్శక నిర్మాతలు ఎదురుచూసినప్పటికీ దొరకడం కష్టంగా మారుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం తొలి చిత్రాలతో బిజీగా ఉన్నాయని ఒక పాట పాడితే రూ .3 కోట్లు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు