Mega157 : మెగా ప్రాజెక్ట్ పై కన్ఫ్యూజన్.. ఎవ్వరూ సెట్టవ్వడం లేదా?

Mega157 : మెగాస్టార్ చిరంజీవి ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడా? తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టేందుకు ఎందుకు ఆలస్యం అవుతుంది. కథ ఫిక్స్ అయి ఏడాది పైనే అయినా ఎందుకు స్టార్ట్ చేయలేదు. ఈ ప్రశ్నలన్నీ మెగా ఫ్యాన్స్ ని కలవరపెడుతున్నాయి. అసలు వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ కం బ్యాక్ తర్వాత చిరంజీవి వరుస సినిమాలు లైన్లో పెట్టాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస కథలను ఒకే చేసాడని వార్తలు వచ్చాయి. అందులో రెండు మూడు రీమేక్ కథలు కూడా ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్ ‘భోళా శంకర్ తో డిజాస్టర్ అందుకున్న చిరు (Chiranjeevi) చేస్తున్న రీమేక్ సినిమాలన్నీ పక్కన పెట్టేసాడు. తన పూర్తి ఫోకస్ విశ్వంభర పై మాత్రమే పెట్టాడు. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. కానీ ఆ తర్వాత ప్రాజెక్ట్ ఎవరితో అని అనుకుంటూ ఉండగా కథ అయితే రెడీగా ఉంది కానీ, డైరెక్టర్ మాత్రం సెట్ అవడం లేదని సమాచారం.

Still Confused About Chiranjeevi's Next Project Mega157?

మెగా డైరెక్టర్ సెట్ అవడం లేదా?

ఇక మెగాస్టార్ చిరంజీవి 157వ (Mega157) సినిమా స్టోరీని రచయిత దర్శకుడు బివిఎస్ రవి (BVS Ravi) సిద్ధం చేయగా, స్టోరీ లైన్ చిరంజీవి ఒకే చేసి, స్క్రిప్ట్ పై మరిన్ని డెవలెప్మెంట్ చేయిస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తుంది. ముందుగా ఈ ప్రాజెక్ట్ కి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తాడని వార్తలొచ్చాయి. కానీ అతను క్యాన్సిల్ అయ్యాడు. ఆ తర్వాత ఫైనల్ గా మొన్నటివరకు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్ట్ చేస్తాడని వార్తలు రాగా, చిరు ‘బర్త్ డే’ కి ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ చిరంజీవి బర్త్ డే కి ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. దాంతో సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందా అన్న వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

ఒకే అంటే స్టార్ డైరెక్టర్స్ రెడీ కానీ..

అయితే చిరంజీవి కి కేవలం వీళ్ళు మాత్రమే కాకుండా అనుదీప్, హరీష్ శంకర్, మారుతీ, సురేందర్ రెడ్డి లాంటి దర్శకులు ఎందరో కథలు వినిపించగా, చిరు మాత్రం వాటిపై ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. దీనికి కారణం రీసెంట్ గా ఆ దర్శకులు తెరకెక్కించిన సినిమాలు కూడా ఆశించిన రెస్పాన్స్ తెచుకోకపోవడమే అని తెలుస్తుంది. ఏది ఏమైనా దసరా లోపు మెగా157 పై క్లారిటీ రావొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక డైరెక్టర్ ఎవరైనా ఈ ప్రాజెక్ట్ ని మాత్రం చిరు పెద్ద కూతురు సుస్మిత నిర్మించడం జరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు