KILL : బాలీవుడ్ లేటెస్ట్ హిట్ రీమేక్ కోసం టాలీవుడ్ హీరోలు పోటీ..

KILL : బాలీవుడ్ లో ఈ మధ్య పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. ఎన్నో భారీ అంచనాలు మధ్య వచ్చిన బడే మియా చోటే మియా వంటి సినిమాలు కూడా దారుణంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవగా, సైలెంట్ గా వచ్చిన చిన్న సినిమాలు మాత్రం అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. సైతాన్, ముంజ్య వంటి చిన్న సినిమాలు వంద కోట్లకి పైగా వసూలు చేసి బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా “కిల్” అనే మరో చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోగా, థియేటర్ల వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతుంది. బాలీవుడ్ ప్రముఖ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘కిల్’. ఈ సినిమా రీసెంట్ గా పది రోజుల కింద, అనగా జులై 5న థియేటర్లలో విడుదలై మౌత్ టాక్ తో మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా విడుదలకైనా కిల్ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని మౌత్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది.

Sudheer Babu, Kiran Abbavaram try for remake rights of KILL movie

 

- Advertisement -

యాక్షన్ డ్రామాగా కిల్..

యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కిన కిల్ సినిమాకు మౌత్ టాకే ప్లస్ అయిందని చెప్పాలి. నిఖిల్ నగేష్ భట్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో లక్ష్య అనే కొత్త హీరో లీడ్ రోల్‌ లో నటించాడు. ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి కూడా కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కదులుతున్న రైలులో ఓ హీరో.. విలన్లను క్రేజీగా చంపుతూ ఉంటాడు.. అసలు ఎందుకు వాళ్ళని చంపుతాడు. హీరో పాత్ర ఏంటి? అనేదే కథగా చూపించారు. చాలా చిన్న కథే అయినా, కథలో పెద్దగా ట్విస్ట్‌లు ఏం లేకపోయినా.., వాళ్లని చంపే విధానాన్ని, అందుకు గల కారణాలని డైరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, అద్భుతమైన స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ తీశాడు. దీంతో ఆడియన్స్‌ సినిమాకు బాగా కనెక్ట్ అవుతుండగా, ఈ సినిమా రీమేక్ కోసం ఇప్పటినుంచే పోటీ మొదలైంది.

కిల్ కోసం ఈ ఇద్దరు పోటీ?

ఇక యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘కిల్’ సినిమా రీమేక్ రైట్స్ కోసం టాలీవుడ్ నుంచి ఇద్దరు యంగ్ హీరోలు పోటీ పడుతున్నట్టు సమాచారం. ఆ హీరోలు ఎవరో కాదు సుధీర్ బాబు, మరొకరు కిరణ్ అబ్బవరం. కిల్ నిర్మాత అయిన కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌ ను రీసెంట్ గా వీరు సంప్రదించినట్లు సమాచారం. ‘కిల్’ సినిమా హక్కుల కోసం ఈ ఇద్దరూ గట్టిగా ట్రై చేస్తున్నారని టాక్. మరి ఇద్దరిలో ఈ రైట్స్ ఎవరు కిల్ రీమేక్ రైట్స్ దక్కించుకుంటారో చూడాలి. అలాగే తమిళ, కన్నడ నిర్మాతలు కూడా ఈ సినిమా రీమేక్ కోసం ఎగబడుతున్నారట. అయితే చాలా మంది నెటిజన్లు ఈ సినిమాలో హీరో పాత్ర సుధీర్ బాబుకి బాగా సూట్ అవుతుందని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుద్దో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు