Suhas: మీ భవిష్యత్తేంటో నేనేం చెప్పగలను..

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోల బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. కేవలం బ్యాగ్రౌండ్ వాళ్లకి సినిమా ఓపెనింగ్ వరకు మాత్రమే పనికొచ్చింది. ఆ తర్వాత వాళ్లను వాళ్ళు ప్రూవ్ చేసుకొని హీరోలుగా నిలద్రొక్కుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు బ్యాక్ గ్రౌండ్ ద్వారా వచ్చిన వాళ్ళే, అయితే బ్యాక్ గ్రౌండ్ ద్వారా వచ్చారు అని పేరే కానీ వాళ్ళకంటూ ఒక స్థాయిని, ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సాధించుకున్నారు.

ఇకపోతే ఇండస్ట్రీలో స్వయంకృషితో వచ్చిన హీరోలు కూడా కొందరు ఉన్నారు. వారిలో రవితేజ దగ్గర నుంచి మొదలు పెడితే నేటి తరంలో నాని, నవీన్ పోలిశెట్టి, సుహాస్ వీళ్ళ పేర్లను చెప్పొచ్చు. ఇకపోతే ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి, సుహాస్ వచ్చిన అవకాశాలన్నింటినీ చేసేయకుండా, చాలా పద్ధతిగా ప్లానింగ్ ప్రకారం వాళ్లకు నచ్చే సినిమాలు మాత్రమే ఎంచుకొని ఆడియన్స్ మెచ్చే విధంగా చేస్తున్నారు.

ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయిన వెంటనే దాదాపు ఐదారు ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అవకాశాలు ఏకధాటిగా వస్తాయి. ఆ టైంలో అవకాశాలు వచ్చాయి కదా అని చెప్పి ఏ కథ పెడితే ఆ కథను ఓకే చేస్తే, అప్పటివరకు ఆ హీరో క్రియేట్ చేసుకున్న మార్కెట్ అనేది దెబ్బతింటుందని చెప్పొచ్చు. ఇలానే చాలామంది ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. పర్ఫెక్ట్ కథల్ని ఎంచుకుంటూ ముందుకెళ్లే వాళ్ళకి లాంగ్ రన్ ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నానిని చెప్పవచ్చు. నాని ఎంచుకునే ప్రతి కథ కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది.

- Advertisement -

ఇక సుహాస్ విషయానికి వస్తే ఇప్పటివరకు సుహాస్ మొత్తం మూడు సినిమాలు చేశాడు. అయితే వాటిలో ఒక సినిమా డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ అయింది. అదే కలర్ ఫోటో. ఆ సినిమాతోనే సుహాస్ మంచి పేరును సాధించుకున్నాడు. ఆ తర్వాత సుహాస్ చేసిన రెండవ సినిమా రైటర్ పద్మభూషణ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి హిట్ అయి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలను కూడా అందుకుంది.

ఇకపోతే సుహాస్ చేసిన మూడో సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా మంచి హిట్ అయిందని చెప్పవచ్చు. కమర్షియల్ గా హిట్ కావడమే కాకుండా ఈ సినిమాకి కూడా మంచి ప్రశంసలు లభించాయి. అయితే ప్రస్తుతం సుహాస్ చేస్తున్న సినిమా ప్రసన్నవదనం. ఆ సినిమా టీజర్ నేడు రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది చిత్ర యూనిట్.

ఇకపోతే రీసెంట్ గా సోహెల్ నటించిన బూట్కెట్ బాలరాజు అనే సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయింది. అయితే ఎవరు ఊహించని రీతిలో ఆ సినిమా డిజాస్టర్ పాలయ్యింది. సోహెల్ కి బిగ్ బాస్ తో వచ్చిన ఫేమ్ తో కొన్ని సినిమాలను చేశాడు. అయితే ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని అనిపించుకోలేదు. ఇకపోతే బూట్ కట్ బాలరాజు సినిమా విషయంలో ఆడియన్స్ ని సోహెల్ తన సినిమా చూడమని వేడుకున్న విషయం తెలిసింది.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక జర్నలిస్ట్ సుహాస్ ను తమ సినిమా చూడమని కన్నీళ్లు పెట్టుకునే వారికి మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు. అని అడిగినప్పుడు సుహాస్ చాలా సెటైరికల్ గా స్పందించాడు. ఒక సినిమాలోని బ్రహ్మానందం డైలాగును తన వే లో చెబుతూ రియాక్ట్ అయ్యాడు. నా ప్రజంటే నాకు తెలియట్లేదు నీ ఫ్యూచర్ నేనేం చెప్పగలను అన్నట్లు. మీ భవిష్యత్తేంటో నేనేం చెప్పగలను.. అంటూ సుహాస్ రియాక్ట్ అయ్యాడు. దాంతోపాటు షార్ట్ ఫిలిమ్స్ లో బాగా యాక్ట్ చేస్తే సినిమా వాళ్ళు పిలుస్తారని, అలా యాక్ట్ చేయడం వల్ల నన్ను పిలిచారని చెప్పుకొచ్చాడు. ముందు టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అని మాట్లాడాడు సుహాస్.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు