Sukumar : అల్లు ఫ్యాన్స్ వల్ల ఇమేజ్ డ్యామేజ్… సుక్కూ హర్ట్ అయ్యాడా?

Sukumar : పుష్ప 2పై జరుగుతున్న ప్రచారం వల్ల సినిమా ఈసారైనా అనుకున్న టైమ్ కు రిలీజ్ అవుతుందా? లేదా? అనే ఆసక్తి పెరిగిపోయింది. అయితే దీనంతటికీ కారణం డైరెక్టర్ సుకుమార్ అనే విమర్శలు ఎక్కువగా విన్పిస్తున్నాయి. దీంతో ఈ రూమర్లు, విమర్శల వల్ల ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది అంటూ సుకుమార్ హర్ట్ అయ్యడని తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

సుక్కూను టార్గెట్ చేసిన అల్లు ఫ్యాన్స్

ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పుష్ప 2’ గురించే జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 6కి వాయిదా పడింది. అనుకున్న ప్రకారం షూటింగ్ జరగకపోవడంతో ఆ తేదీకి కూడా మూవీ విడుదల కాకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అల్లు అర్జున్, సుకుమార్ మధ్య విభేదాలు తలెత్తాయని నెట్టింట్లో జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దర్శకుడు షెడ్యూల్స్ పూర్తిగా మార్చడం, బన్నీ ఫారిన్ టూర్‌కు వెళ్లే ముందు గడ్డం ట్రిమ్ చేయడం, మరోవైపు సుక్కూ ట్రిప్ కు వెళ్ళడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనంతటికీ కారణం డైరెక్టర్ అంటూ సోషల్ మీడియాలో అందరూ సుకుమార్ పై నిందలు వేయడం మొదలుపెట్టారు. అభిమానులే కాకుండా సాధారణ సినీ ప్రేమికుల నుండి కూడా ఆయనపై నెగెటివ్ కామెంట్స్ విన్పిస్తున్నాయి. బన్నీ, సుకుమార్ మధ్య ఎలాంటి సమస్యలు లేవని చిత్ర యూనిట్, బన్నీ పీఆర్ టీమ్ స్పష్టం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Sukumar Must Change That Mistake First?

- Advertisement -

ఫారిన్ ట్రిప్ సీక్రెట్ ఇదే

అసలు విషయానికొస్తే.. కూతురు అడ్మిషన్ ప్రక్రియను చక్కబెట్టేందుకు సుక్కు భార్యతో కలిసి అమెరికా వెళ్ళాడు. ఈ పనిని చాలా కాలం క్రితమే సుక్కూ షెడ్యూల్ చేసుకున్నాడు. పైగా దర్శకుడు దీని కోసం షూట్‌ను రద్దు చేయలేదు. అతను తన వ్యక్తిగత విషయాలతో బిజీగా ఉన్న సమయంలో పుకార్లు దావానలంలా వ్యాపించాయి. బాహుబలి కంటే పుష్పకే ఎక్కువ టైమ్ పడుతోంది. పుష్ప 2 విషయంలో ఎందుకింత ఆలస్యం జరుగుతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా సుకుమార్ ను ప్రశ్నిస్తున్నారు.  సినిమా వాయిదాల మీద వాయిదా పడుతుండడంతో అందరూ ఒక్కసారిగా సుకుమార్‌ ను టార్గెట్ చేశారు.

డైరెక్టర్ హర్ట్

ఈ నెగెటివిటీ అంతా సుకుమార్‌ను బాధించిందని, దీంతో సన్నిహితుల దగ్గర సుక్కూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సినిమా విషయంలో తాను చేయగలిగినంత బాగా చేస్తున్నాను అంటూ ఆవేదనను వ్యక్తం చేశారట. అయితే కొన్ని అడ్డంకుల కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. మరోవైపు విడుదల వాయిదా పడడానికి తాను మాత్రమే కారణం కాదని ఆయన వాదిస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి సపోర్ట్ గా బన్నీ ప్రచారం చేయడంతో ఆయనకు తీవ్ర నెగెటివిటీ వచ్చింది. అందుకే సినిమాను వాయిదా వేయాలని నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. డిసెంబరు నాటికి పరిస్థితులు చల్లబడతాయనే ఉద్దేశంతో పుష్ప 2ను వాయిదా వేసినట్లు సమాచారం. అయితే సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలతో ఇంటెలిజెంట్ డైరెక్టర్ కలత చెందుతున్నాడని టాక్ నడుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు