Sundeep Kishan : ఏ ధైర్యంతో 30 కోట్లు, సందీప్ కిషన్ సినిమాకు అంత వర్కౌట్ అవుతుందా.?

Sundeep Kishan : ప్రస్థానం(Prasthanam), స్నేహ గీతం(Sneha Geetham) వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు సందీప్ కిషన్. ఆ తర్వాత తను కూడా హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. రొటీన్ లవ్ స్టోరీ(Routine Love Story), వెంకటాద్రి ఎక్స్ప్రెస్(Venkatadri Express) వంటి సినిమాలు సందీప్ కిషన్ కెరియర్ కి మంచి ప్లస్ అయ్యాయి. ఆ తర్వాత సినిమాలు చేసినా కూడా అవి సరైన గుర్తింపును తీసుకురాలేదు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు సినిమాలను నిర్మిస్తూ బిజినెస్ రంగంలో కూడా అడుగు పెట్టాడు సందీప్. ఇక రీసెంట్ గా ధనుష్ దర్శకత్వంలో వచ్చిన రాయన్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమాతో సందీప్ కిషన్ కి మంచి పేరు వచ్చింది.

ఇక ప్రస్తుతం సందీప్ కిషన్ స్వరూప్ ఆర్ఎస్జె దర్శకత్వంలో వైబ్(Vibe) అనే ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అలానే త్రినాధరావు నక్కిన(Trinadh Rao Nakkina) దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బడ్జెట్ దాదాపు 30 కోట్లు ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. వాస్తవానికి సందీప్ కిషన్ తో 30 కోట్లు బడ్జెట్ అనేది కొంచెం రిస్క్ ప్రాసెస్ అని చెప్పాలి. ఈ 30 కోట్లలో సందీప్ కిషన్ రెమ్యునరేషన్ 6 కోట్లు అని తెలుస్తుంది. సందీప్ కిషన్ రెమ్యూనరేషన్ తో చాలామంది నిర్మాతలు అవాక్కవుతున్నారు. డిజిటల్ రైట్స్ లేవు, శాటిలైట్ రైట్స్ లేవు ఎలా బిజినెస్ అవుతుంది.? ప్రొడ్యూసర్ ఏ ధైర్యంతో చేస్తున్నాడో అర్థం కావడం లేదు.

Sundeep Kishan

- Advertisement -

ఇక త్రినాధరావు నక్కిన విషయానికొస్తే రీసెంట్ గా ధమాకా(Dhamaka) సినిమాతో 100 కోట్ల సినిమాను తన కెరియర్ మూటగట్టుకున్నాడు అని చెప్పాలి. త్రినాధరావు నక్కిన తన కెరియర్లో చేసిన సినిమాలన్నీ కూడా సేఫ్ జోన్ ప్రాజెక్ట్స్ అని చెప్పాలి. ఒకవైపు భారీ హిట్లు కావు మరోవైపు అలానే డిజాస్టర్లు కావు కానీ సేఫ్ సినిమాలు. ధమాకా మాత్రం అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆ ధైర్యంతోనే తన సినిమాకు 30 కోట్లు బడ్జెట్ వస్తుందని దర్శకుడు ఊహించాడా, లేకపోతే నిజంగానే కథ అంత రిక్వైర్ చేస్తుందనేది అంతు తేలని విషయం.

ఇక సందీప్ కిషన్(Sundeep Kishan) విషయానికి వస్తే తెలుగు తో పాటు తమిళంలో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆల్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన మైకేల్ సినిమా వర్కౌట్ కాలేదు కానీ ఆ సినిమా వర్కౌట్ అయి ఉంటే సందీప్ కిషన్ మార్కెట్ విపరీతంగా పెరిగేది అని చెప్పాలి. ఏదేమైనా 30 కోట్లతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా, తప్పుతుందా తెలియాలి అంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు