Super Star’s Jalier: చిరుకి జైలర్ చెక్ పెట్టేలా ఉన్నాడు..!

Super Star’s Jalier

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఆగస్టు 10న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి సినిమాపై ఆసక్తి పెంచగా కావాలయ్యా సాంగ్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘హుకుం’ సాంగ్ రిలీజ్ అయ్యి సినిమాకి మరింత హైప్ పెంచింది. ఈ సాంగ్ లో రజినీకాంత్ లుక్స్ ని, స్టైల్ ని ఎలివేట్ చేసింది.

గత కొంత కాలంగా సరైన హిట్ లేని సూపర్ స్టార్ కి ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. ఇటీవలే ఓటీటీకి ఎంట్రీ ఇచ్చిన తమన్నాకి  లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ద్వారా వచ్చిన క్రేజ్ జైలర్ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

అయితే, ఆగస్టు 11న రిలీజ్ అవుతున్న చిరంజీవి భోళాశంకర్ సినిమాకి జైలర్ సినిమా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. భోళాశంకర్ సినిమా రీమేక్ అవ్వడం, మెహర్ రమేష్ డైరెక్టర్ అవ్వటంతో మొదటి నుంచి మెగా ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి లేదు. దీనికి భోళాశంకర్ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఏ ఒక్కటి కూడా సినిమాపై అంతగా హైప్ క్రియేట్ చేయలేకపోయాయి. ‘జామ్ జామ్ జజ్జనక’, మిల్కీ బ్యూటీ సాంగ్స్ లో చిరు స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ లో గ్రేస్ ఒక్కటే ఈ సినిమాకు పాజిటివ్ ఎలిమెంట్ గా కనిపిస్తుండగా ట్రైలర్ కట్ కూడా ఎఫెక్టివ్ గా లేదు.

- Advertisement -

జైలర్ సినిమా ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉండగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ సహా నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్టార్టింగ్ నుండి పాజిటివ్ వైబ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక మరింత బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మెగాస్టార్ సినిమా రేంజ్ లో బజ్ లేని భోళాశంకర్ జైలర్ ఇవ్వబోయే పోటీని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు