Kanguva : పండగలు ఖాళీ లేవ్.. అందుకే అప్పుడు దిగుదామని చూస్తున్నారు?

Kanguva : కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న “కంగువ” చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాతో భారీ పాన్ ఇండియా హిట్ పై క‌న్నేశాడు సూర్య. ఇంతకు ముందు కూడా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేసినప్పటికీ సూర్య ఆశించినంత విజయం మాత్రం దక్కలేదు. ఇక కంగువ సినిమాని తమిళ దర్శకుడు శివ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇతడు తెలుగులో కూడా శౌర్యం, శంఖం, దరువు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇక సూర్య నటిస్తున్న కంగువ సినిమాని స్టూడియోగ్రీన్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా 200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కంగువ ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని టీజర్ తో సూర్య అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులలో కూడా ప్రకంపనలు సృష్టించింది. మూవీ లవర్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక పీరియాడిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య ఒక తెగకు చెందిన వారియర్‌గా, బాబీ డియోల్ మరో తెగకు చెందిన విల‌న్‌ గా కనిపించడం తో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ 80 శాతానికి పైగా పూర్తయిపోగా, సినిమా రిలీజ్ డే విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు విడుదల తేదీలు మారుతూనే ఉన్నాయి. అందుకే మేకర్స్ రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు.

Suriya Kanguva movie New Release date update

పండగల్లేవ్.. అందుకే ఆ డేట్ కి?

ఇదిలా ఉండగా కంగువ సినిమాని ఆగష్టు 15 మొదలుకొని ఏదైనా పండగ సీజన్ లోనే రిలీజ్ చేద్దామని మేకర్స్ ట్రై చేస్తున్నా ఒక్క ఫెస్టివల్ సీజన్ కూడా ఖాళీగా లేదు. ఇండిపెండెన్స్ డే కి వద్దామనుకున్నా, షూటింగ్ ఆలోపు పూర్తయ్యే ఛాన్స్ లేదు. ఫినిష్ అయినా ప్రమోషన్లకు టైం ఉండదు. ఇక దసరా కి ముందు దేవర, దసరా టైం లో రజినీకాంత్ సినిమాలున్నాయి. కనీసం దీపావళికైనా వద్దామనుకుంటే అజిత్ విదా మాయూర్చి లైన్లో ఉంది. ఇక దసరా, దీపావళి మధ్య ఎదో ఒక పండక్కి దూరుదామని గేమ్ ఛేంజర్ చూస్తున్నాడు. అందుకే సూర్య అన్ సీజన్ అయిన డిసెంబర్ లో రావాలని చూస్తున్నట్టు టాక్ నడుస్తుంది. డిసెంబర్ 6న పుష్ప విడుదలవుతున్నా, అది రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత అంటే డిసెంబర్ రెండో వారంలో, లేదా మూడో వారంలో గాని కంగువ ని ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నారట. అంటే క్రిస్మస్ కి వారం రోజులు ముందుగా, కుదిరితే పది రోజులు ముందుగా రావాలని ట్రై చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సమాచారం ఎంతవరకు కరెక్టో క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -

స్కై లెవెల్లో అంచనాలు..

ఇక సూర్య కంగువ సినిమాపై ఇక జ‌నంలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న క్యూరియాసిటీని మ‌రింత‌ పెంచడానికి మేకర్స్ కొత్త పోస్టర్లు రిలీజ్ చేస్తూ అంచనా పెంచుతున్నారు. ఇక సూర్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో చేస్తున్న కంగువ (Kanguva) మూవీ నుండి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ సినిమా మీద ఉన్న హైప్ బాగానే పెంచాయి. అయితే సినిమా రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ వల్ల ప్రమోషన్లు కూడా చేయడం లేదు. రిలీజ్ డేట్ ని అఫిషియల్ గా ఫిక్స్ అయిన తర్వాతే కంగువ మూవీ ప్రమోషన్లు మొదలుపెట్టే అవకాశం కనిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ నుండే రావాలి. ఇక సూర్య కంగువలో రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, అందులో ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఉంది. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు