Swaroop RSJ : ఈసారి యాక్షన్ లవ్ స్టోరీ

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది దర్శకులుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే కొంతమంది తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటారు. కొందరు తమ మొదటి సినిమాతోనే ఒక బ్రాండ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తారు. ఇలా క్రియేట్ చేసినవాళ్లు సందీప్ రెడ్డి వంగ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో శివ సినిమా చూపించిన ప్రభావాన్ని మళ్లీ అర్జున్ రెడ్డి సినిమా చూపించింది అంటూ చాలామంది సందీప్ ని పొగుడుతూ వచ్చారు.

ఇకపోతే అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు స్వరూప్ ఆర్ఎస్ జె. ఈ సినిమా అద్భుతంగా మంచి సక్సెస్ను సాధించింది. ఒక మంచి కథ ఉంటే చాలు సక్సెస్ అనేది కొట్టొచ్చు అని ప్రూవ్ చేసిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమాను స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్క నిర్మించారు.

రాహుల్ యాదవ్ ఒక ఐదుగురు కొత్త డైరెక్టర్లను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను అంటూ ఇదివరకే ఒక స్టేట్మెంట్ను ఇచ్చారు. ఆ ప్రకారమే మళ్లీ రావా అనే సినిమాతో గౌతమ్ తిన్ననూరి అనే దర్శకుడిని ముందుగా పరిచయం చేశారు. ఆ తర్వాత స్వరూప్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో పరిచయం చేశాడు. తర్వాత మసూద అనే సినిమాను నిర్మించాడు రాహుల్.

- Advertisement -

ఇకపోతే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా సక్సెస్ తర్వాత స్వరూప్. తాప్సిని ఒక కీలక పాత్రలో చూపించి ముగ్గురు చిన్న పిల్లలతో మిషన్ ఇంపాజిబుల్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ కాలేదు. కానీ ఈ సినిమాకి విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఇకపోతే ఇప్పుడు సందీప్ కిషన్ తో తన మూడవ సినిమాని స్వరూప్ తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాను రాహుల్ యాదవ్ నక్క నిర్మిస్తున్నారు. అయితే ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. ముందు సినిమా డిటెక్టివ్ జానెర్ లో చేసి మంచి సక్సెస్ను అందుకున్న స్వరూప్, రెండవ సినిమాతో కూడా దాదాపు మంచి సక్సెస్ ని అందుకున్నాడు. కానీ ఈసారి కొత్తగా మరో సపరేట్ జానెర్ సినిమా చేస్తున్నాడు స్వరూప్.

అయితే స్వరూప్ సందీప్ తో చాలాకాలంతో ట్రావెల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వీరి కాంబినేషన్లో సినిమా అంటే అందరికీ కొద్దిపాటి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే తను లవ్ స్టోరీస్ రాయటంలో కొంచెం వీక్ అంటూ ఇదివరకే చెప్పుకొచ్చాడు స్వరూప్. మరి ఈ లవ్ స్టోరీని ఎలా రాశాడు తెలియాలి. అంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడక తప్పదు. ఎట్టకేలకు తన జోనర్ మార్చి వేరే జోనర్ లో కథను సిద్ధం చేశాడు స్వరూప్.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు