Tamannah : మిల్కీ బ్యూటీ కాస్తా..గోల్డెన్ బ్యూటీ అయిందే..!

Tamannah : టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ ని ఊపేసిన ఈ భామ ప్రస్తుతం పెద్దగా ఛాన్సులు లేక ఢీలా పడింది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావట్లేదు. లాస్ట్ ఇయర్ చేసిన పలు సినిమాలు ప్లాప్ కాగా, ఈ ఏడాది తమిళ్ లో అరణ్మలై 4 సినిమా తో ఓ మోస్తరు హిట్ అందుకుంది. ఇక ప్రస్తుతానికైతే కొన్ని ప్రెస్టీజియస్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ఓదెల2 సినిమాలో నటిస్తుండగా, ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా అఘోర పాత్రలో నటిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అవ్వబోతుంది. అయినా కూడా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇక ఈ మధ్య కాలంలో మిల్కీ బ్యూటీ మరింత అందంగా తయారు అయ్యింది అంటూ ఆమె ఫ్యాన్స్ మరియు నెటిజన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Tamannah Bhatia latest hot photoshoot viral on social media

మిల్కీ బ్యూటీ గోల్డెన్ బ్యూటీగా..

ఇక తాజాగా తమన్నా చేసిన ఫోటో షూట్‌ కూడా సోషల్ మీడియా లో తెగ వైరల్ అయింది. విభిన్నమైన ఔట్‌ ఫిట్ లో గోల్డ్‌ కలర్‌ సింబల్స్ తో డిజైనర్ వేర్‌ ను ధరించిన మిల్కీ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అది చూసి మిల్కీ బ్యూటీ గోల్డెన్ బ్యూటీ అయ్యిందే అన్నట్లుగా నెటిజన్స్‌ ఈ ఫోటోలను తెగ షేర్‌ చేస్తున్నారు. క్లీవేజ్ షో అందంతో పాటు నడుము అందాలను చూపించడం ద్వారా మిల్కీ బ్యూటీ ఇంకా తాను కొత్త ముద్దుగుమ్మలకు పోటీ ఇవ్వగలను అన్నట్లుగా ఈ ఫోటోలతో చెప్పకనే చెబుతోంది. ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్న మిల్కీ బ్యూటీ మరో పదేళ్ల పాటు వరుస సినిమాలు చేస్తానంటోంది. కేవలం సినిమాల్లో హీరోయిన్‌ గా మాత్రమే కాకుండా ఐటెం సాంగ్స్ చేయడంతో పాటు వెబ్‌ సిరీస్‌ లు చేస్తూ అప్పుడప్పుడు మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటిస్తుంది.

- Advertisement -

వరుస ఛాన్సులతో బిజీ!

ఇక మొన్నటి వరకూ పెద్దగా ఆఫర్లు లేకపోయే సరికి ఫోటోషూట్ల తో గడిపిన తమన్నా, ఈ ఇయర్ మాత్రం బిజీ అయింది. తెలుగులో ఓదెల 2 చిత్రంలో నటిస్తున్న తమన్నా(Tamannah), హిందీలో స్త్రీ 2, వేదా అనే సినిమాలలో నటిస్తుంది. ఇలా ఏదో ఒక ఆఫర్‌ ను దక్కించుకుంటూ సుదీర్ఘ కాలంగా బిజీగా ఉంటున్న మిల్కీ బ్యూటీ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ అందంగా కనిపిస్తూనే ఉంటుంది. తాజా ఫోటోలను నెటిజన్స్‌ తెగ లైక్‌ చేస్తూ షేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మిల్కీ బ్యూటీ మరింత అందంగా కనిపిస్తున్నారు అంటూ ఈ ఫోటోలకు కామెంట్స్‌ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మిల్కీ బ్యూటీ సీనియర్‌ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. త్వరలో తెలుగులో వెంకటేష్, రవితేజ సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం ఉందట.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు