Vijaya Lakshmi : పెళ్లి పేరుతో మోసం… ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ నటి సెల్ఫీ వీడియో

సోషల్ మీడియా అందుబాటులోకి రావడం అనేది కొంతమందికి శాపంగా మారితే, మరి కొంతమందికి మాత్రం తాము చెప్పాలనుకున్న విషయాన్ని అందరికీ తెలియజేసే ఒక ఆయుధంలా మారింది. టెక్నాలజీని ఉపయోగించుకొని తమకు న్యాయం జరిగేలా చూసుకుంటున్నారు సాధారణ ప్రజలు కూడా. అయితే ఇటీవల కాలంలో లైవ్ లో తాము చనిపోవడానికి గల కారణాలు చెబుతూ ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. ఇంకా కొంతమంది మాత్రం సెల్ఫీ వీడియోలతో తమ ఆత్మహత్యకు గల కారణం ఎవరు? ఏంటి ? అనే విషయాలను బయట పెట్టి, పోలీసులకు పెద్దగా కష్టపడే అవసరం లేకుండా తమ చావుకి ఎవరు బాధ్యులో చెప్పి మరీ చనిపోతున్నారు. తాజాగా ఓ నటి కూడా పెళ్లి పేరుతో మోసపోయాను, ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇంతకీ ఎవరా నటి? ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? అనే వివరాల్లోకి వెళితే…

తమిళ నటి సెల్ఫీ వీడియో
ప్రేమ పేరుతో వాడుకుని వదిలేసిన ఓ వ్యక్తి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకోబోతున్నాను అంటూ తాజాగా ప్రముఖ తమిళ నటి విజయలక్ష్మి ఓ సూసైడ్ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో విజయలక్ష్మి మాట్లాడుతూ “మీడియా మిత్రులకు నమస్కారం. ఫిబ్రవరి 29న నేను ఒక వీడియోను నామ్ తమిళ కర్ కట్చి సమన్వయకర్త సీమాన్ కు పంపాను. నాతో కలిసి జీవించాలని కోరుతూ అతనికి ఆ వీడియో పంపాను” అని చెప్పుకొచ్చింది. అయితే పెళ్లి పేరుతో అతని చేతిలో మోసపోయానని, అందుకే గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని విజయలక్ష్మి తాజాగా రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది.

పెళ్లి పేరుతో వాడుకుని మోసం…
పెళ్లి చేసుకుంటానని చెప్పి సీమాన్ తనతో మూడేళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాడని, తన జీవితాన్ని నాశనం చేశాడని, పెళ్లి పేరుతో వాడుకున్నన్ని రోజులు వాడుకుని, ఇప్పుడు తనను నడిరోడ్డు మీద వదిలేసాడని తాజా వీడియోలో విజయ లక్ష్మి పేర్కొంది. అయితే అతనికి మార్చ్ 5వ తేదీ వరకు గడువు ఇచ్చిందట ఈ నటి. అంతలోపు తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అతనికి ముందుగానే వార్నింగ్ ఇచ్చిందట. ఇప్పుడు ఆ గడువు పూర్తి కావడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో తెలిపింది.

- Advertisement -

ఇదే చివరి వీడియో…
సీమాన్ పెళ్లి చేసుకుంటానని మూడేళ్లు తనతో రహస్య జీవితం గడిపాడని, ఇప్పుడేమో మోసం చేసి, ఎవరైనా ఈ విషయంలో తనకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్లను తరిమికొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కర్ణాటకలో తాను జీవించలేని పరిస్థితి నెలకొందని, ఇదే తన చివరి వీడియో అంటూ ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని బయట పెట్టింది. అంతేకాదు ఆ వీడియోలో కర్ణాటక పోలీసులు తన గురించి నెక్స్ట్ అప్డేట్ ఇస్తారని, తన మరణానికి కారణం అవుతున్న సీమాన్ దీనిపై వివరణ ఇవ్వాలంటూ విజయలక్ష్మి తన ఆత్మహత్యకు బాధ్యులు ఎవరు అన్న విషయాన్ని ఆ వీడియోలో బయట పెట్టింది. మరి ఇంతకీ ఆ వీడియోను రిలీజ్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు సీమాన్ పై చర్యలు తీసుకున్నారా ? విజయ లక్ష్మికి న్యాయం జరిగిందా? అన్న విషయాలపై ఆసక్తి నెలకొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు