Bhupinder Singh: యువకుడిని కాల్చి చంపిన పవన్ కళ్యాణ్ విలన్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల ద్వారా చాలామంది హీరోయిన్ లు, విలన్ లు వెండితెరకు పరిచయమై మరింత గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు భూపీందర్ సింగ్ కూడా ఒకరిని చెప్పాలి. ఈయన పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. బాలీవుడ్ నటుడిగా, టీవీ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న భూపీందర్ సింగ్ ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తన లైసెన్స్డ్ రివాల్వర్ తో పొరుగు ఇంట్లో ఉన్న ఒక కుర్రాడిపై కాల్పులు జరిపి ఒకరి మరణానికి కారణమైనందుకుగాను ఈయనను పోలీసులు అరెస్టు చేశారు..

అయితే ఈ వివాదం ఎక్కడ తలెత్తింది అనే విషయానికి వస్తే..భూపీందర్ సింగ్‌కు బిజ్నోర్‌లో పొలం ఉంది. ఈ పొలానికి కంచ వేయడానికి అక్కడ అడ్డుగా ఉన్న చెట్లను కొట్టేసే సమయంలో భూపీందర్ సింగ్ కు అలాగే పొరుగున ఉన్న గుర్దీప్ సింగ్ కు మధ్య వివాదం చోటు చేసుకుంది. చూస్తూ ఉండగానే ఈ వివాదం కాస్త ఎక్కువ అయ్యి.. ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరుకుంది.. దీంతో కోపోద్రిక్తుడైన భూపీందర్ , అతడి వెంట ఉన్న మరో ముగ్గురు సహాయకులు.. గుర్దీప్ సింగ్ కుటుంబంపై దాడికి దిగారు. ఈ క్రమంలోనే భూపీందర్ తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో గుర్దీప్ కుటుంబం పై కాల్పులు జరపగా.. అక్కడే ఉన్న గుర్దీప్ 22 సంవత్సరాల కుమారుడు గోవిందు బుల్లెట్ తగలి అక్కడికక్కడే మరణించాడు.

గుర్దీప్ భార్య బీరో బాయ్, వారి మరో కుమారుడు అమ్రీక్ తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వీరు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే భూపీందర్ పై హత్యాయత్నం, హత్య, కావాలని గాయపరచడం తదితర సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆయుధాల చట్టం కింద కూడా నటుడు పై కేసు ఫైల్ చేయడం గమనార్హం

- Advertisement -

ఇక భూపేందర్ సింగ్ విషయానికి వస్తే ఉత్తరాది సినీ టీవీ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన ఈయన.. ‘యే ప్యార్ న హోగా కమ్‘, ‘మధుబాల’ వంటి టీవీ సీరియల్స్ తో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ‘తమ్ముడు’, ‘దేవీ పుత్రుడు’, ‘అన్నయ్య’, ‘భలేవాడివి బాసూ’, ‘విలన్’, ‘అంజి’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ వంటి తెలుగు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు