The Family Man: ది ఫ్యామిలీ మెన్ సిరీస్ లో భాగమవ్వబోతున్న తెలుగు యంగ్ హీరో

The Family Man: ప్రస్తుతం ఓటిటీ ప్లాట్ఫామ్స్ లో ఉన్న అన్ని సిరీస్ కంటే కూడా ఫ్యామిలీ మెన్ సిరీస్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ మెన్ సిరీస్ 2019లో సీజన్ వన్ విడుదలైంది. ఈ సిరీస్ కి మంచి వ్యూయర్షిప్ వచ్చింది. అయితే ఆ తర్వాత 2021 లో సీజన్ 2 కూడా రిలీజ్ అయింది ఈ సీజన్ 2 లో సమంత కీలక పాత్రలో కనిపించింది.
ఫ్యామిలీ మెన్ సీజన్ 3 గురించి చాలామంది ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే రీసెంట్ గానే ఫ్యామిలీ మెంబర్స్ సీజన్ 3 కూడా షూటింగ్ మొదలైంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఎక్కడ పూర్తయిందో అక్కడినుంచి ఇది ఫ్యామిలీ మ్యాన్ 3 స్టార్ట్ కానుంది. శ్రీకాంత్ తివారి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు ఆయనకు వయసు పెరిగిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎలా ఫేస్ చేశాడు అని చూపించడమే సీజన్ 3 అని తెలుస్తుంది. 2025లో amazon ప్రైమ్ వీడియోలో ఈ సీజన్ 3 విడుదల కానున్నట్లు సమాచారం.

Sundeep Kishan

- Advertisement -

ఇకపోతే ఒక తెలుగు హీరో సీజన్ 3 లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. తను మరెవరో కాదు సందీప్ కిషన్. ముందుగా చిన్న చిన్న సినిమాల్లో కొన్ని పాత్రలు వేసి ప్రస్థానం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. ఆ తర్వాత చాలామంది కొత్త దర్శకులతో పనిచేసి హీరోగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తెలుగు తమిళ్లో ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసిన సందీప్ ఇప్పుడు ఓటిటిలో కూడా ఫ్యామిలీ మ్యాన్ వంటి ప్రతిష్టాత్మక సిరీస్ లో భాగం కాబోతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు