Thandel: శరవేగంగా తండేల్ షూటింగ్, నెక్స్ట్ షెడ్యూల్ అక్కడే

Thandel: కార్తికేయ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు చందు ముండేటి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వడం మాత్రమే కాకుండా చాలామంది విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత మలయాళం సూపర్ హిట్ సినిమా ప్రేమను తెలుగులో ప్రేమమ్ పేరుతో రీమేక్ చేశాడు నాగచైతన్య నటించిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సవ్యసాచి సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు

ప్రతి దర్శకుడికి కూడా తమ కెరియర్లు ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంటూ ఉంటుంది అలా చందు విషయానికి వస్తే నిఖిల్ హీరోగా చేసిన కార్తికేయ 2 సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. చందు ని ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ ను చేసేసింది. మరోవైపు నిఖిల్ ని కూడా పాన్ ఇండియా హీరోయిన్ చేసింది. దాదాపు 100 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. ప్రస్తుతం చందు పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తాడు. ప్రస్తుతం చందు నాగచైతన్యతో తండెల్ ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

ఉత్తరాంధ్ర మాండలికంలో నాగచైతన్య

తండేల్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య కి జంటగా సాయి పల్లవి నటిస్తోంది. వీరిద్దరూ కలిసి ఇదివరకే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వీరిద్దరి జంట కూడా చూడముచ్చటగా ఉంటుందని చాలా కామెంట్స్ వినిపించాయి. ఇకపోతే తండేలు సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా చాలామంది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఉత్తరాంధ్ర మాండలికంలో నాగచైతన్య మాట్లాడబోతున్నాడు.

- Advertisement -

Thandel

సినిమా కథాంశం

ఈ సినిమా కథాంశానికి వస్తే పాకిస్తాన్ జాలల్లోకి వెళ్లి దాదాపు రెండేళ్ల పాటు జైల్లో ఉండి భారత్ కు తిరిగి వచ్చిన రాజు అని ఒక వ్యక్తి నిజ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ జూన్ 10వ తారీఖు నుంచి స్టార్ట్ కానుంది రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని సీన్స్ చేసిన తర్వాత, శ్రీకాకుళం లోని మరికొన్ని సీన్స్ ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. జిఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అల్లు అర్జున్ సమర్పికల్ గా వ్యవహరిస్తున్నారు ఈ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు