Thangalaan Trailer Talk : తంగలాన్ ఆ మూవీకి కాపీనా? ట్రైలర్ తో దొరికిపోయిన విక్రమ్ టీం

Thangalaan Trailer Talk : చియాన్ విక్రమ్ హీరోగా నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ తంగలాన్ ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ట్రైలర్ ను చూశాక ఎక్కడో చూసినట్టుందే అనే అనుమానం కలుగుతుంది చాలామందికి. సోషల్ మీడియా వేదికగా ఇదే విషయాన్ని వెల్లడిస్తూ తంగలాన్ మూవీని ఎక్కడ కాపీ కొట్టారు అనే విషయాన్ని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి ఇంతకీ ఈ మూవీనీ ఏ మూవీ నుంచి కాపీ కొట్టారు ? అనే వివరాల్లోకి వెళ్తే…

తంగలాన్ ఆ మూవీకి కాపీనా ?

చాలామంది తంగలాన్ ట్రైలర్ ను చూశాక అందులోని పలు సన్నివేశాలను ఇంతకు ముందే ఎక్కడో చూసాము అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే బంగారు కొండను తవ్వడానికి వెళ్లే క్రమంలో విక్రం అండ్ టీం ఎదుర్కొనే కష్టాలను చూస్తుంటే గతంలో వచ్చిన యుగానికి ఒక్కడు మూవీ గుర్తొస్తుంది. తంగలాన్ సినిమాలో హీరో కొంతమందిని వెంటేసుకుని బ్రిటిష్ వాళ్ల కోసం బంగారు కొండను తవ్వడానికి వెళ్తాడు హీరో. అయితే ఆ క్రమంలో వాళ్లకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. దీంతో చాలామంది చనిపోతారు కూడా. చివరికి మిగిలేది హీరోతో పాటు మరికొంతమంది మాత్రమే. అలాగే యుగానికి ఒక్కడు సినిమాలో కూడా ఏడు ప్రమాదాలను అధిగమించి చివరకు టార్గెట్ ను రీచ్ అవుతారు. కానీ తీరా అక్కడికి వెళ్లేసరికి హీరో హీరోయిన్ మాత్రమే మిగులుతారు. ఇదే కాన్సెప్ట్ తో మేకర్స్ తంగలాన్ ను కూడా తెరకెక్కించినట్టుగా అనిపిస్తోందనీ అంటున్నారు. నిజానికి దీన్ని కాపీ అనడం కన్నా పోలిక అనడం బెటర్. ఎందుకంటే ఈ రెండు డిఫరెంట్ మూవీస్.

Yuganiki Okkadu GIF - Yuganiki Okkadu Parthibhan - Discover & Share GIFs

- Advertisement -

ఈ సీన్స్ చూస్తే తెలిసిపోతోంది

తంగలాన్ ట్రైలర్ లోని కొన్ని సన్నివేశాలను చూస్తుంటే అచ్చం యుగానికి ఒక్కడు సినిమాలోని సీన్స్ గుర్తొస్తున్నాయి. పాము కాటుతో తంగలాన్ లో ఒక వ్యక్తి చనిపోవడం, అక్కడ దయ్యాలు పిశాచాలు ఉన్నాయని నువ్వే చెప్పావు కదా అంటూ హీరోను ఆ కొండ దగ్గరకు వెళ్లకుండా ఉండడానికి ఒక ఆవిడ ఆపడం, హీరో మొండిగా అన్ని ప్రమాదాలను ఎదుర్కొని అక్కడకు వెళ్లడం వంటివి యుగానికి ఒక్కడు సినిమాను తలపిస్తున్నాయి. యుగానికి ఒక్కడు సినిమాలో కూడా అచ్చం ఇలాగే మంటలు, పాములు వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఒక తెగకు చెందిన వ్యక్తిగా హీరో ఎక్కడో మారుమూల నివసిస్తూ ఉంటాడు. ఇంట్లో చెప్పి తన వాళ్లను కొంతమందిని తీసుకొని ఈ పని కోసం వెళ్తాడు. చివరకు పట్టు వదలకుండా టార్గెట్ ను రీచ్ అవుతాడు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే యుగానికి ఒక్కడు సినిమాలో కార్తీ లుక్ ఎలా ఉందో, దాదాపుగా తంగలాన్ సినిమాలో విక్రమ్ లుక్ కూడా అలాగే ఉందనీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య పోలిక రావడానికి ఇదే మెయిన్ రీజన్. ఏదైతేనేం ఓవరాల్ గా తంగలను ట్రైలర్ మాత్రం బాగుంది. దీంతో ఈసారి విక్రమ్ బాక్స్ ఆఫీసును బద్ధలు కొట్టడడం ఖాయమని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు