Kalki2898AD : ఆ థ్రిల్స్ అన్ని ఆ సీన్ లోనే ఉంటాయట..!

Kalki2898AD : టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న కల్కి2898AD సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ అంచనాలను పెంచే ప్రయత్నంలో ఉంది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న హైప్ ఆకాశాన్ని దాటేసింది. ఇక పాన్ వరల్డ్ రేంజ్ లో కల్కి ని రిలీజ్ చేస్తుండడం వల్ల సినిమాకు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి గ్రాండియర్ సినిమాకు గ్లోబల్ వైడ్ రీచ్ రావాలంటే మినిమం నెల రోజులు కేవలం ప్రమోషన్లపైనే దృష్టి పెట్టాలి. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కింది. ఇదిలా ఉండగా కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కల్కి 2898AD (Kalki2898AD) సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. కల్కి వరల్డ్ ఎలా ఉంటుంది.. అసలు కల్కి ఏం చేస్తాడు అన్నది శాంపిల్ గా కల్కి ప్రీల్యూడ్ తో చూపించాడు నాగ్ అశ్విన్. కల్కి యానిమేటెడ్ సీరీస్ చూసిన ఆడియన్స్ సినిమాపై ఒక అంచనాకు వచ్చారు. కల్కి సినిమాను నాగ్ అశ్విన్ అంచనాలకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్కి పై వచ్చిన ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి కిక్కిస్తుంది.

The climax of the Kalki2898AD movie will thrill the audience

ఆ సీన్లో ఫ్యాన్స్ థ్రిల్స్ అవ్వడం ఖాయం?

ఇక కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి పార్ట్ అన్ని పాత్రలను పరిచయం చేయడం భైరవ లక్ష్యం పెట్టుకోవడం ఫస్ట్ పార్ట్ లో చూపిస్తారని తెలుస్తుంది. ఇక కల్కి 2898AD క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. కల్కి యూనివర్స్ కు లీడ్ ఇస్తూ సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెరిగేలా సస్పెన్స్ లో కల్కి ఫస్ట్ పార్ట్ ని ముగిస్తారట. అంతేకాదు కల్కి సినిమా అంతా ఒక ఎత్తైతే.. చివరి అరగంట మరో ఎత్తని అంటున్నారు. ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసే అద్భుతమైన విజువల్స్ తో కల్కి ఉండబోతుందని తెలుస్తుంది. ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ లోనే నాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వనున్నారని సమాచారం. ఇక ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ఒక యానిమేషన్ కంపెనీనే రన్ చేస్తున్నాడని తెలుస్తుంది. కల్కి తో ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ కి వెళ్తాడని అంటున్నారు. ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తూ దాదాపు 22 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

- Advertisement -

నెవర్ బిఫోర్ రేంజ్ లో…

ఇక కల్కి2898AD సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ భాగం అవుతున్నారు. ప్రభాస్ సరసన దీపిక పదుకొనె నటిస్తున్న కల్కిలో కమల్ హాసన్, అమితాబ్, దిశా పటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, శోభన ఇలా అందరు తమ ఎంట్రీతో ఆడియన్స్ ని అలరిస్తారని తెలుస్తుంది. ఇక కల్కి 2898AD తో ఫస్ట్ డే భారీ టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నారట. ఏకంగా RRR ఫస్ట్ డే రికార్డ్ ని బ్రేక్ చేసి అల్ టైం రికార్డ్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే సినిమాను నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి కల్కి 2898 ఏడి తో నాగ్ అశ్విన్ తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడని చెప్పొచ్చు. ప్రభాస్ కూడా బాహుబలి, సలార్ సినిమాల తర్వాత కల్కితో మరోసారి తన మాస్ స్టామినా చూపించడానికి సిద్ధమయ్యాడు. ఇక కల్కి ని ఒక్క ఇండియా లోనే ఎనిమిది వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు